Chanakya Niti : జీవిత భాగస్వామి ఎంపికలో ఈ విషయాలు పాటించమంటున్న చాణక్య.. ఆ రహస్యాలేంటో తెలుసుకోండి
Chanakya Niti : ఆచార్య చాణక్యుడు రచించిన నీతి శాస్త్రంలో మనిషి జీవన విధానం గురించి ఎన్నో విషయాలు చెప్పాడు. మనుషులు ఎలా నడుచుకోవాలి.. విజయాలు సాధించడానికి ఏం చేయాలి.. ఎవరితో ఎలా ఉండాలి. వేటికి దూరంగా ఉండాలనే అంశాలపై చాణక్య తన నీతి శాస్త్రంలో వివరించాడు. చాణక్య నీతి అందరికీ అనుసరణీయం. అందుకే ఇప్పటికీ యువత మొదలు ప్రతిఒక్కరూ చాణక్య చెప్పిన జీవిత సూత్రాలు పాటిస్తున్నారు. చాణక్య తన అనుభవాలతో మనుషుల స్వాభావాల గురించి ఎప్పుడో తన నీతి శాస్త్రంలో చెప్పాడు. మనుషుల స్వార్థం..
కపట ప్రేమ, కష్టాలు, నష్టాలు, ఆర్థిక ఎదుగుదల వంటి అనేక అంశాలపై చెప్పాడు. అయితే పెళ్లి ప్రతి ఒక్కరి జీవతంలో భాగమే. అయితే భాగస్వామిని ఎంచుకోవడంలో తప్పు చేయొద్దని లేదంటే జీవితాంతం బాధపడతారని చెప్పాడు. ఆడ మగ ఎవరైనా జీవిత భాగస్వామిని ఎంచుకునే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చాణక్య తన నీతి శాస్త్రంలో వివరించాడు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం… అయితే చాలా మంది తమకు పెళ్లి ఇష్టం లేకపోయినా తల్లిదండ్రల ఒత్తిడితోనే లేక అమ్మాయి బలవంతంతోనే చేసుకుంటుంటారు. ఇలా పెళ్లి ఒత్తిడిలో చేసుకుంటే జీవితాంతం ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి.
Chanakya Niti : పద్దతి ప్రకారం పెళ్లి చేసుకోవాలి
అందుకే మనసుకు నచ్చిన అమ్మాయిని పద్దతి ప్రకారం ఆచార సాంప్రదాయాలను పాటించి పెళ్లి చేసుకోవాలని సూచించాడు. చాణక్య నీతి ప్రకారం అమ్మాయి అందం కంటే కూడా గుణాన్ని చూడాలని అప్పుడే లైఫ్ హ్యాప్పీగా ఉంటుందని సూచించాడు. కేవలం అందాన్ని చూసి పెళ్లి చేసుకునే వారు భవిష్యత్తులో చాలా ఇబ్బందలు పడే అవకాశం ఉందని చెప్పాడు. భాగస్వామి ఎంపికలో ఎలాంటి లక్షణాలు ఉన్నాయో పరిశీలించాలని ఓపిక, సహనం ఎంత ఉన్నాయో పరిశీలించాలని చెప్పాడు. ఓపికతో ఉన్న వ్యక్తి ఉన్న చోట ఆనందం ఉంటుందిని, గౌరవం పెరుగుతుందని సూచించాడు.