Jio Cinema : జియో సినిమా దెబ్బకి ఇండియన్ సినిమా ఇండస్ట్రీ సంక నాకిపోవడం గ్యారెంటీ ?
Jio Cinema : ఇండియా జియో కంపెనీ గురించి వాటికి ఉన్న ప్రాధాన్యత గురించి అందరికీ తెలిసిందే. ఎయిర్టెల్ ఇండియా లాంటి కొన్ని కంపెనీలు మాత్రమే జియోని ఎదుర్కోగలుగుతున్నాయి. చాలావరకు ఇతర కంపెనీలు కనుమరిగిపోయాయి. తాజాగా రిలయన్స్ అంబానీ వేసిన మెగా పతకం బాలీవుడ్ కొంప ముంచేలా ఉంది అని చర్చ జరుగుతుంది. తాజాగా అంబానీ ఉచిత సినిమాలు చూసేందుకు రెడీగా ఉండండి అంటూ ప్రకటించాడు అంతే కాదు వాటి ట్రైలర్ ని రిలీజ్ చేసి కంగారు పెట్టాడు. జియో యాప్ ఉచిత సినిమా ఆఫర్ ప్రకటించగానే అందరీ దృష్టి అటువైపు పడింది. ఆరంభం షాహిద్ కపూర్ లాంటి స్టార్ హీరో బ్లడీ డాడీ సినిమాని జియో ఉచితంగా అందిస్తోంది.
అలాగే తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటించిన ముంబై కర్ సినిమాలు కూడా జియో ఉచితంగా అందిస్తుంది. దీంతో ఇప్పుడు ప్రజల్లో ఆసక్తికర డిబేట్ మొదలైంది. ఇకపై జియోలో ఉచిత సినిమాలు చూసే వెసులుబాటు ఉంటుందనగానే ఎగ్జిబిటర్లు పంపిణీ వర్గాలలో ఆందోళన మొదలైంది. జియో ఉచిత సినిమాల పథకం తమ కొంప మంచేలా ఉందని వీళ్లంతా ఆందోళనలో ఉన్నట్లు తెలుస్తుంది. జియో 100కు పైగా సినిమాలు పలు వెబ్ సిరీస్ లను అందించేందుకు సిద్ధంగా ఉంది వీటిలో ఒరిజినల్ కంటెంట్ జనాలను బాగా ఆకర్షించేలా ఉంది. వారానికి ఒక ఉచిత సినిమా అంటూ ప్రచారం సాగించిన సక్సెస్ అవుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.
జియో సినిమా తన వినియోగదారులను పెంచుకునేందుకు ఇతర ఓటిటిలతో పోటీగా దిగడంతో, ఇది ఇతర ఓటిపి వర్గాల్లోను గందరకోడానికి కారణమైంది. డబ్బులు చెల్లించేందుకు ఆసక్తిగా లేని వాళ్లు కూడా ఉచిత సినిమాలు, సిరీస్ ల కోసం జియో యాప్ లో గంటల తరబడి గడిపినా భారీగా వచ్చే వ్యూస్ ద్వారా పెట్టుబడుల్ని తిరిగి రాబట్టవచ్చు. ఒకేసారి లాభాలను ఆర్జించే యోచన అంబానీ కంపెనీలకు లేదు. కాబట్టి సుదీర్ఘ కాలంలో భారీ ఆదాయాన్ని ఆర్జించే యోచన బాగానే పని చేస్తుందనడంలో సందేహం లేదు. అంబానీ ఒక ప్లాన్ వేస్తే దానికి ఎదురుండదు. కానీ ఇప్పుడు ఇది బాలీవుడ్ పై ప్రభావం చూపిస్తుందని బాలీవుడ్ వర్గాలు ఆందోళనలు ఉన్నాయి.