Indian Navy Recruitment : ఇండియన్ నేవీ రిక్రూట్ మెంట్ 2024.. డాక్ యార్డ్ అప్రెంటీస్ పోస్టులకు ఇలా అప్లై చేయండి..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Indian Navy Recruitment : ఇండియన్ నేవీ రిక్రూట్ మెంట్ 2024.. డాక్ యార్డ్ అప్రెంటీస్ పోస్టులకు ఇలా అప్లై చేయండి..!

 Authored By ramu | The Telugu News | Updated on :1 December 2024,6:30 am

ప్రధానాంశాలు:

  •  Indian Navy Recruitment : ఇండియన్ నేవీ రిక్రూట్ మెంట్ 2024.. డాక్ యార్డ్ అప్రెంటీస్ పోస్టులకు ఇలా అప్లై చేయండి..!

Indian Navy Recruitment : ఇండియన్ నేవీ నుంచి ఒక సరికొత్త రిక్రూట్ మెంట్ వచ్చింది. ఐ.టి.ఐ అర్హతతో ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. భారతీయ జాతీయతతో ఉన్న ఎవరైనా సంబంధిత అర్హతలు ఉంటే చాలు ఈ జాబ్ కు అప్లై చేసుకునే అవకాశం ఉంది. విశాకపట్నం నేవీ డాక్ యార్డ్ అప్రెంటీస్ స్కూల్ లో అప్రెంటీస్ చట్టం 1961 కిన శిక్షణ ఇచ్చి వివిధ ఖాళీల్లో ఉద్యోగాలు ఇస్తారు.

Indian Navy Recruitment రిక్రూట్‌మెంట్ పేరు : భారతీయ నేవీ డాక్‌యార్డ్ అప్రెంటిస్‌షిప్ 2024 నియామకాలు

కండక్టింగ్ బాడీ : నావల్ డాక్‌యార్డ్ అప్రెంటీస్ స్కూల్ ఏరియా విశాఖపట్నం
మొత్తం ఖాళీల సంఖ్య : 275
అర్హత : ఐ.టి.ఐ ఉన్న అభ్యర్ధులు ఈ జాబ్ కు అప్లై చేయొచ్చు. అప్లికేషన్ మోడ్ : ఈ జాబ్ అప్లికేషన్ ఆన్ లైన్, ఆఫ్ లైన్ లో చేసుకోవచ్చు.
దరఖాస్తు చివరి తేదీ : జనవరి 2, 2025
శిక్షణ వ్యవధి : 1 సంవత్సరం కాలం పాటు
అధికారిక వెబ్‌సైట్ www.apprenticeshipindia .gov .in

Indian Navy Recruitment ఇండియన్ నేవీ రిక్రూట్ మెంట్ 2024 డాక్ యార్డ్ అప్రెంటీస్ పోస్టులకు ఇలా అప్లై చేయండి

Indian Navy Recruitment : ఇండియన్ నేవీ రిక్రూట్ మెంట్ 2024.. డాక్ యార్డ్ అప్రెంటీస్ పోస్టులకు ఇలా అప్లై చేయండి..!

Indian Navy Recruitment దీనికి కావాల్సిన అర్హత ప్రమాణాలు

విద్యా అర్హతలు :ఎస్.ఎస్.సి లో 50% మొత్తం మార్కులు లేదా మెట్రిక్యులేషన్ లేదా సంబందిత ట్రేడ్ లో 65 శాతం మార్కులతో ఐ.టి.ఐ పూర్తి చేసి ఉండాలి.

వయో పరిమితి : 14 సంవత్సరాల కనిష్ట వయసు మే 2, 2011 లేదా అంతకు ముందు జన్మించిన అభ్యర్థులు అర్హులు.

శారీరక దృఢత్వం : అప్రెంటీస్‌షిప్ రూల్స్ ప్రకారం తో పాటు 1992లోని రూల్ 4లో ఇవ్వబడిన భౌతిక ప్రమాణాలు ఉండాలి.

ఎంపిక ప్రక్రియ :

షార్ట్‌లిస్టింగ్ : 70:30 శాతంతో ఎస్సెస్సీ మరియు ఐ.టి.ఐ మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది.

వ్రాత పరీక్ష : 75 ప్రశ్నలతో ఓ.ఎం.ఆర్ ఆధారిత పరీక్ష (దీనిలో మ్యాథ్స్ : 30, జనరల్ సైన్స్ : 30, జనరల్ నాలెడ్జ్ : 15). ఎలాంటి నెగెటివ్ మార్కింగ్ లేదు. ఫిబ్రవరి 28, 2025న షెడ్యూల్ చేయబడింది.

ఇంటర్వ్యూ తేదీ : మార్చి 7, 2025 నుండి షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థుల కోసం డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు టెక్నికల్ స్కిల్ అసెస్‌మెంట్.

అప్లికేషన్ ప్రారంభ తేదీ : మొదలైంది..
అప్లికేషన్ ముగింపు తేదీ :జనవరి 2, 2025
వ్రాత పరీక్ష తేదీ : ఫిబ్రవరి 28, 2025
ఇంటర్వ్యూ తేదీ : మార్చి 7, 2025
శిక్షణ ప్రారంభం :మే 2, 2025 Indian Navy Recruitment, Navy Recruitment , Navy Jobs, 2024 Jobs

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది