Intinti Gruhalakshmi 4 Oct Today Episode : శృతి.. ప్రేమ్ ను ప్రేమిస్తోందని.. నందు వల్ల తన ప్రేమను త్యాగం చేసిందని తెలుసుకున్న తులసి ఏం చేస్తుంది? శృతి, ప్రేమ్ ను కలుపుతుందా? అక్షర, ప్రేమ్ పెళ్లి ఆపేస్తుందా?
Intinti Gruhalakshmi 4 Oct Today Episode : ఇంటింటి గృహలక్ష్మి 4 అక్టోబర్, 2021 సోమవారం లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు ఎపిసోడ్ 441 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రేమ్ కు ఏమంటే ఇష్టమో.. ఏమంటే ఇష్టం లేదో.. తులసిని అడుగుతుంది అక్షర. అప్పుడే శృతి కూడా వస్తుంది. దీంతో తొందరపడి.. అక్షర అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పేస్తుంది. వామ్మో.. ప్రేమ్ గురించి నీకు అన్ని విషయాలు తెలుసు శృతి. ప్రేమ్ గురించి నీకు అన్ని విషయాలు తెలుసు కాబట్టి.. ప్రేమ్ కు దగ్గరవడానికి నువ్వే నాకు హెల్ప్ చేయాలి అంటుంది అక్షర.
అవును శృతి.. నువ్వు ఎవరినైనా ప్రేమించావా? అని అడుగుతుంది అక్షర. దీంతో షాక్ అవుతుంది శృతి. ఏమైంది చెప్పు.. అంటే ప్రేమించడం గొప్ప కాదు అక్షర.. అవతలి వాళ్ల ప్రేమను పొందడం గొప్ప అంటుంది శృతి. అవును శృతి.. ఇది మాత్రం నూటికి నూరు పాళ్లు నిజం.. అని అంటుంది అక్షర.
కట్ చేస్తే.. ప్రేమ్ తన ఎంగేజ్ మెంట్ గురించి గుర్తు తెచ్చుకొని బాధపడుతుంటాడు. అప్పుడే శృతి.. ప్రేమ్ కు కాఫీ ఇవ్వడానికి వెళ్తుంటుంది. అప్పుడే శృతిని చూసిన అక్షర ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది. ప్రేమ్ కాఫీ కావాలన్నాడు అని అడుగుతుంది. అవునా.. నేను వెళ్లి ఇస్తాను శృతి అంటుంది. దీంతో సరే.. తీసుకో అని చెబుతుంది. ప్రేమ్ కు అక్షర వెళ్లి కాఫీ ఇస్తుంది. అదేంటి కాఫీ నువ్వు తీసుకొచ్చావు అని అడుగుతాడు ప్రేమ్. ఏం నేను తీసుకురాకూడదా? అంటే.. అలా కాదు.. నీకు ఈ అలవాటు ఉండదు కదా అని అంటాడు ప్రేమ్. అలవాటు లేదు కానీ.. నీకోసం అలవాటు చేసుకుంటున్నాను అంటుంది అక్షర. కాఫీ చేతికి ఇస్తుంది. ప్రేమ్ కాఫీ బాగుందా.. అని అడుగుతుంది. దీంతో ఈ కాఫీ నువ్వు చేశావా అని అడుగుతాడు. లేదు.. శృతి చేసింది అంటుంది. కాఫీ చాలా బాగుంది అనేసరికి.. సరే అయితే.. కాఫీ ఎలా చేయాలో శృతి దగ్గర నేర్చుకుంటాను అని చెబుతుంది అక్షర.
కట్ చేస్తే.. శృతి.. ప్రేమ్ తో తనకున్న అనుబంధాన్ని నెమరు వేసుకుంటుంది. ఇంతలో తులసి అక్కడికి వస్తుంది. ఏంటి శృతి.. నువ్వు వెళ్లి ఇవ్వాల్సిన కాఫీని అక్షర తీసుకెళ్లిందని బాధపడుతున్నావా? అంటుంది. లేదు ఆంటీ.. నేనెందుకు బాధపడతాను.. అంటుంది. కాఫీ తీసుకెళ్తేనే అంత బాధపడుతున్నావా? మరి.. అంతకన్నా ముఖ్యమైంది.. నీ జీవితాన్నే అక్షర లాగేసుకుంది కదా.. అంటుంది తులసి. నేను బాగానే ఉన్నాను అంటీ.. అంటుంది శృతి.
Intinti Gruhalakshmi 4 Oct Today Episode : ప్రేమ్ పెళ్లిని ఇద్దరం దగ్గరుండి జరిపించాలని తులసికి చెప్పిన నందు
తులసి నీతో కొంచెం మాట్లాడాలి.. అని అంటాడు నందు. త్వరలో పెళ్లి పనులు ప్రారంభం కావాలి.. అలాగే.. జీకే గారు నువ్వు, నేను.. ప్రేమ్ పెళ్లి జరిపించాలి.. అంటాడు. అబ్బో.. ఇప్పుడు మనం గుర్తుకొచ్చామా.. ప్రేమ్ మనసులో ఏముందో తెలుసుకోకుండా.. ఇలా చేయడం తప్పు కదా అంటే.. ఇంకా శృతి గురించి మాట్లాడొద్దు. నువ్వు ఇంకా నా మాట వినకుండా… ప్రేమ్, శృతి పెళ్లి చేయాలని పట్టుబడితే ప్రేమ్ కు తండ్రి ఉండడు. పరందామయ్యకు కొడుకు ఉండడు.. అని వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు నందు.
ఇంతలో జీకే.. నందుకు ఫోన్ చేస్తాడు. జీకే గారు.. అనే సరికి.. ఇప్పటి నుంచి బావ గారు అని పిలవండి.. అంటాడు. అక్షర ఎలా ఉంది.. అని అడుగుతాడు. అక్షర బాగా ఉంది. తనే మమ్మల్ని చూసుకుంటోంది అని చెబుతాడు నందు. ఇంతలో తులసి వచ్చే సరికి.. తులసితో మాట్లాడుతాడు. పెళ్లి పనుల గురించే కాస్త కంగారుగా ఉంది అంటే.. అదేం లేదు అన్నయ్య గారు.. అంతా బాగానే ఉంది.. మీరేం కంగారు పడకండి అంటుంది తులసి.
తన రూమ్ లో ప్రేమ్ ఫోటో చూస్తూ తెగ ఏడ్చేస్తుంటుంది శృతి. తన ఏడుపును చూసిన తులసి.. తన దగ్గరికి వెళ్తుంది. ఏంటో ప్రేమ్.. నా జీవితం ఎలా సాగుతుందో.. ఎటువైపు వెళ్తుందో ఏం అర్థం కావడం లేదు. అసలు నువ్వు నాకు ఎందుకు పరిచయం అయ్యావు.. ఎందుకు నన్ను అభిమానించావు. ఇప్పుడు నీ అభిమానం వల్ల.. నేను చాలా బాధపడాల్సి వస్తోంది.. అని తనలో తాను అనుకుంటుంది. ఇంతలోనే శృతి.. అని పరందామయ్య పిలిచే సరికి వస్తున్నావు అని అంటుంది. ఇంతలో తులసి.. శృతికి కనిపించకుండా దాక్కుంటుంది. శృతి వెళ్లగానే.. అక్కడికి వెళ్లి ఆ ఫోటోను చూస్తుంది తులసి. అది ప్రేమ్ ఫోటో కావడంతో షాక్ అవుతుంది తులసి.
అంటే.. శృతి.. ప్రేమ్ ను ఇంకా ప్రేమిస్తోందన్నమాట. మరి.. ఎందుకు శృతి.. ప్రేమ్ ను వద్దని చెప్పింది. తనను ఎవరు ఆపారు? అని తనలో తాను అనుకుంటుంది తులసి. ఆ తర్వాత శృతితో నందు మాట్లాడటం చూస్తుంది తులసి. నువ్వు నా కోసం ప్రేమ్ ప్రేమను త్యాగం చేశావు. కానీ.. నువ్వు ఇక్కడుంటే ఏ క్షణమైనా ఈ పెళ్లి వద్దని చెప్పేస్తాడేమోనని భయంగా ఉంది. ఈ పెళ్లి అయిపోయేంతవరకు ఇంట్లోంచి వెళ్లిపోయి ఇంకెక్కడైనా ఉంటే బాగుంటుందనేది నా ఉద్దేశం అని నందు చెప్పడంతో శృతి షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగం కోసం వెయిట్ చేయాల్సిందే.