I Phone 17 | ఐఫోన్ 17 సిరీస్‌లో కొత్తగా ‘ఎయిర్’ మోడల్ ..భారీ మార్పుల దిశగా..
I Phone 17 | టెక్ దిగ్గజం యాపిల్ తన కొత్త ఐఫోన్ సిరీస్‌ను ఆవిష్కరించేందుకు సన్నద్ధమవుతోంది. ‘ఆ డ్రాపింగ్’ (Awe Dropping) పేరుతో సెప్టెంబర్ 9న, మంగళవారం నిర్వహించనున్న ప్రత్యేక ఈవెంట్‌లో ఐఫోన్ 17 సిరీస్‌ను అధికారికంగా విడుదల చేయనుంది. ఈసారి యాపిల్, గత ఐదేళ్లలో ఎప్పుడూ లేనంతగా డిజైన్‌లో భారీ మార్పులు చేస్తుందనే ఊహాగానాలు ఉన్నాయి. ముఖ్యంగా, ఇప్పటి వరకు ఉన్న ‘ప్లస్’ మోడల్‌కి బదులుగా కొత్తగా ‘ఐఫోన్ 17 ఎయిర్’ ను పరిచయం చేసే అవకాశముంది.

#image_title
ఐఫోన్ 17 ఎయిర్
తక్కువ మందంతో (కేవలం 5.5 మిల్లీమీటర్లు) రూపొందించబడి, ఇప్పటి వరకు వచ్చిన ఐఫోన్లలో అత్యంత సన్నని మోడల్గా రికార్డు సాధించనుందని అంచనా.మ్యాక్‌బుక్ ఎయిర్, ఐప్యాడ్ ఎయిర్‌ల డిజైన్ స్ఫూర్తితో రూపొందించినట్లు సమాచారం.
6.6 అంగుళాల డిస్‌ప్లే, ప్రోమోషన్ సపోర్ట్, మరియు ఏ19 ప్రాసెసర్ వంటి అధునాతన ఫీచర్లు ఉండనున్నాయని లీకులు చెబుతున్నాయి. ఐఫోన్ 17, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ మోడళ్లు కూడా ఈ ఈవెంట్‌లో లాంచ్ కానున్నాయి.ప్రత్యేకించి ప్రో మోడళ్లలో కెమెరా విభాగంలో పెద్ద మెరుగుదలలు కనిపించనున్నట్లు అంచనా. మెరుగైన జూమ్ సామర్థ్యం ఉంటుంది.
ధరల విషయానికొస్తే, భారత్‌లో ఐఫోన్ 17 బేస్ మోడల్ ధర సుమారు రూ. 89,900 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఐఫోన్ 17 ఎయిర్ ధర రూ. 95,000 వరకు, అత్యంత ఖరీదైన ప్రో మ్యాక్స్ మోడల్ ధర రూ. 1,64,900 వరకు ఉండొచ్చని భావిస్తున్నారు