Apple Event | ఆపిల్ ఈవెంట్ 2025: ఐఫోన్ 17 సిరీస్ లాంచ్‌కు సిద్ధం.. నాలుగు కొత్త మోడల్స్, ఆధునిక ఫీచర్లతో ప్రదర్శన
Apple Event | ఐఫోన్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న క్షణం ఆసన్నమైంది. ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ తన వార్షిక ఈవెంట్‌ను ఈరోజు (సెప్టెంబర్ 10, 2025) కాలిఫోర్నియాలోని స్టీవ్ జాబ్స్ థియేటర్‌లో అంగరంగ వైభవంగా నిర్వహించబోతోంది. ఈ ఈవెంట్‌కు “ఆవ్ డ్రాపింగ్” అనే పేరును ఇచ్చారు. భారత కాలమానం ప్రకారం రాత్రి 10:30 గంటలకు ఈవెంట్ ప్రారంభం కానుంది.

#image_title
ఈవెంట్‌లో అత్యంత ఆసక్తికర అంశం ఐఫోన్ 17 సిరీస్. ఈ సిరీస్‌లో నాలుగు కొత్త మోడల్స్ విడుదల చేయనున్నారు:
ఐఫోన్ 17
ఐఫోన్ 17 ఎయిర్
ఐఫోన్ 17 ప్రో
ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్
ఇందులో “ఐఫోన్ 17 ఎయిర్” ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. కేవలం 5.5 మిల్లీమీటర్ల మందంతో ఇప్పటివరకు లాంచ్ చేసిన ఐఫోన్లలో అత్యంత సన్నని ఫోన్ గా గుర్తింపు పొందనుంది. ఇందులో 6.6 అంగుళాల ప్రో మోషన్ డిస్‌ప్లే, ఏ19 ప్రాసెసర్, ఆపిల్ డెవలప్ చేసిన వై-ఫై చిప్ వంటివి ప్రత్యేకతలుగా ఉంటాయి. ఫిజికల్ సిమ్ స్లాట్ లేకుండా కేవలం ఈ-సిమ్ ఆధారంగా పని చేయనుంది.
ధరల పరంగా ఎలా ఉండబోతోంది?
ఐఫోన్ 17 ఎయిర్: సుమారు 900 డాలర్లు (రూ. 75,000 – 80,000)
ఐఫోన్ 17 బేస్ మోడల్: సుమారు 800 డాలర్లు (రూ. 70,000కుపైగా)
ప్రో & ప్రో మ్యాక్స్ మోడల్స్: $1000+ (రూ. 85,000 పైగా)
ఫీచర్లు & టెక్నాలజీ
ఐఫోన్ 17 బేస్ మోడల్:
120Hz ప్రో మోషన్ టెక్నాలజీ
ఏ19 ప్రాసెసర్
48MP మెయిన్ కెమెరా
ప్రో/ప్రో మ్యాక్స్ మోడల్స్:
6.3 అంగుళాల & 6.9 అంగుళాల డిస్‌ప్లేలు
48MP టెలిఫొటో లెన్స్
ఫ్రంట్ & రియర్ డ్యూయల్ వీడియో రికార్డింగ్
అల్యూమినియం బాడీ (టైటానియం స్థానంలో)