Balineni Srinivasa Reddy : మాజీ మంత్రి బాలినేని పై ఆ ‘గేమ్ ప్లాన్’ అట్టర్ ఫ్లాప్.! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Balineni Srinivasa Reddy : మాజీ మంత్రి బాలినేని పై ఆ ‘గేమ్ ప్లాన్’ అట్టర్ ఫ్లాప్.!

Balineni Srinivasa Reddy : దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడాయన.. ‘వాసన్నా’ అని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రేమగా పిలుచుకునే వ్యక్తి ఆయన. ఆయనెవరో కాదు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి. సామాజిక వర్గ సమీకరణాలు సహా, అనేక ఈక్వేషన్ల నేపథ్యంలో మంత్రి పదవికి కొనసాగింపు లభించలేదుగానీ, లేకపోతే బాలినేని శ్రీనివాస్ రెడ్డిని వైఎస్ జగన్ తన మంత్రి వర్గం నుంచి తొలగించేవారా.? ఛాన్సే లేదు. ఇక, బాలినేని శ్రీనివాస్ రెడ్డి […]

 Authored By aruna | The Telugu News | Updated on :10 August 2022,10:20 pm

Balineni Srinivasa Reddy : దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడాయన.. ‘వాసన్నా’ అని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రేమగా పిలుచుకునే వ్యక్తి ఆయన. ఆయనెవరో కాదు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి. సామాజిక వర్గ సమీకరణాలు సహా, అనేక ఈక్వేషన్ల నేపథ్యంలో మంత్రి పదవికి కొనసాగింపు లభించలేదుగానీ, లేకపోతే బాలినేని శ్రీనివాస్ రెడ్డిని వైఎస్ జగన్ తన మంత్రి వర్గం నుంచి తొలగించేవారా.? ఛాన్సే లేదు. ఇక, బాలినేని శ్రీనివాస్ రెడ్డి మీద చాలా రాజకీయ కుట్రలు జరిగాయి. ఆయనకు సంబంధం లేని పలు వ్యవహారాలతో ఆయనకు ముడిపెట్టి ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ సహా వివిధ విపక్షాలు ఎప్పటికప్పుడు యాగీ చేస్తూనే వుంటాయి. అయినా, బాలినేని శ్రీనివాస్ రెడ్డి మాత్రం ఎప్పుడూ ధైర్యం కోల్పోలేదు. ఈ నేపథ్యంలో బాలినేని శ్రీనివాస్ రెడ్డి మీద విసక్షాలు తాజాగా మరో మైండ్ గేమ్ ప్లాన్ చేశాయి.

బాలినేని శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారబోతున్నారనీ, జనసేనలోకి వెళతారనీ ప్రచారం షురూ అయ్యింది. టీడీపీ అను‘కుల’ మీడియా ఈ ప్రచారానికి తెరలేపింది. టీడపీలోకి బాలినేని వెళతారంటే ఎవరూ నమ్మరు గనుక, ఈ వ్యవహారంలోకి జనసేనను తీసుకొచ్చింది టీడీపీ అనుకూల మీడియా. పార్టీ అధిష్టానం ఇచ్చిన బాధ్యతల మేరకు, పార్టీ పటిష్టత కోసం కార్యకర్తలతో తరచూ సమావేశాలు నిర్వహిస్తున్నారు బాలినేని శ్రీనివాస్ రెడ్డి. దీనిపై వక్రీకరణలకు దిగిన టీడీపీ అనుకూల మీడియా, ఇటీవల పవన్ కళ్యాణ్ ‘చేనేత’ ట్వీటుపై బాలినేని స్పందించడానికి ముడిపెడుతూ, జనసేనలోకి ఆయన వెళుతున్నారన్న ప్రచారానికి తెరలేపింది. జరుగుతున్న విష ప్రచారంపై బాలినేని శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. పదవులతో సంబంధం లేకుండా, ప్రజా సేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చినట్లు స్పష్టం చేసిన బాలినేని, తనకు రాజకీయంగా ఈ స్థాయి కల్పించింది గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అయితే, ఆ తర్వాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని చెప్పారు.

Is Balineni Leaving YSRCP Here Is The Clarity

Is Balineni Leaving YSRCP, Here Is The Clarity

వైసీని వీడే సమస్యే లేదనీ, వైసీపీతోనే తన పూర్తి రాజకీయ జీవితం ముడిపడి వుందని బాలినేని చెప్పుకొచ్చారు. అయితే, బాలినేని మీద వైసీపీలోనే ఓ వర్గం దుష్ప్రచారం చేస్తోన్న ఆరోపణలూ లేకపోలేదు. ఈ విషయమై పార్టీ అధిష్టనానికి బాలినేని ఫిర్యాదు కూడా చేశారట. గతంలోనూ, గుప్తా అనే అనుచరుడిపై వైసీపీ మద్దతుదారులే కొందరు దాడి చేసి, దాంట్లో తనను ఇరికించే ప్రయత్నం చేశారని బాలినేని వాపోతుంటారు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది