Nadendla Manohar: బకరా బకరా బకరా.. నాందెడ్లను బకరా చేస్తున్న పవన్ కళ్యాణ్?
Nadendla Manohar.. ఈ పేరు ఎక్కువగా జనసేన పార్టీలో వినిపిస్తోంది. జనసేన పార్టీలో ఆయన చేరిన తర్వాతనే ఈ పేరుకు బాగా పాపులారిటీ వచ్చింది. నాదెండ్ల జనసేనలో చేరాక.. ఆయనకు కీలక పదవినే కట్టబెట్టారు పవన్ కళ్యాణ్. జనసేన పార్టీకి రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ గా నాదెండ్ల వ్యవహరిస్తున్నారు. అంతవరకు బాగానే ఉంది కానీ.. అసలు.. నాదెండ్లను పవన్ కళ్యాణ్ అందలం ఎక్కించడం దేనికి? అనేది జనసేన మిగితా నేతల్లో ఉన్న అసంతృప్తి. నాదెండ్లకు పార్టీలో ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంపై మిగితా నేతల్లో కాస్త వ్యతిరేకత ఉన్న మాట అయితే వాస్తవం. జనసేనలో పవన్ తర్వాత ఖచ్చితంగా నాదెండ్లనే.
నాదెండ్ల మనోహర్.. పవన్ కు అంత సన్నిహితంగా ఉండటం కొందరు నేతలకు నచ్చక.. పార్టీ నుంచి కూడా బయటికి వెళ్లిపోయారు. అయినా కూడా పవన్ కళ్యాణ్ మాత్రం నాదెండ్లను వదలడం లేదు. దాని వెనుక పెద్ద కారణమే ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు
Nadendla Manohar: కావాలని పథకం ప్రకారం నాదెండ్లను బకరా చేయడం కోసమేనా?
నాదెండ్లను బకరాను చేయడం కోసమే.. కావాలని పథకం ప్రకారం.. పవన్ కళ్యాణ్.. నాదెండ్లను వాడుకుంటున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే.. జనసేన పార్టీ నుంచి వెలువడే రాజకీయ ప్రకటనలను నిశితంగా పరిశీలిస్తే.. ఆ విషయం స్పష్టం అవుతుంది.
ఏపీలో ఏదైనా రాజకీయ ప్రకటనలు ఇవ్వాలన్నా.. ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్రకటన జనసేన నుంచి వెలువడినా.. అది పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పేరుతో వెలువడుతుంది.
అదే.. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్రకటనలు వెలువడాలంటే మాత్రం అవి నాదెండ్ల పేరు మీద వస్తున్నాయి. తాజాగా విశాఖ స్టీల్ ప్లాంట్ కు సంబంధించిన ప్రకటన కూడా నాదెండ్ల పేరు మీదనే వెలువడటం గమనార్హం.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరణ చేసుకోవాలని… జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కోరుతున్నారంటూ నాదెండ్ల పేరుతో ప్రకటన వెలువడటం వెనుక ఆంతర్యం ఏంటి? కేంద్రాన్ని పవన్ డైరెక్ట్ గా ప్రశ్నించలేరా? కేంద్రాన్ని ప్రశ్నించాలంటే నాదెండ్లనే కావాలా? అంటే నాదెండ్లను పవన్ కావాలని బకరా చేస్తున్నట్టే కదా.. అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.