Malla Reddy : మల్లారెడ్డి ఇంటిపై ఐటీ దాడులు.. షాక్ లో మంత్రి.. తనిఖీల్లో ఏం దొరికాయంటే?
Malla Reddy : తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఇంటిపై ఐటీ శాఖ దాడులు కొనసాగుతున్నాయి. మల్లారెడ్డి ఇంటితో పాటు ఆయన కొడుకు, అల్లుడి ఇళ్లలోనూ తనిఖీలు చేస్తున్నారు అధికారులు. మల్లారెడ్డి హైదరాబాద్ లోని బోయినపల్లిలో నివాసం ఉంటున్నారు. బోయినపల్లిలోని ఆయన ఇంట్లో, మంత్రి కొడుకు ఉండే కోంపల్లిలోని ఇంట్లో సోదాలు ప్రారంభించారు అధికారులు. ఏకకాలంలో దాదాపు 50 టీమ్స్ కలిసి ఈ తనిఖీలను అందరి ఇళ్లలో ప్రారంభించాయి.
మంత్రి మల్లారెడ్డిపై పన్ను ఎగవేతకు సంబంధించిన ఆరోపణలు వస్తున్నాయి. దీంతో అధికారులు తనిఖీలు ప్రారంభించారు. మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించిన లావాదేవీలు క్రాంతి బ్యాంకులో నిర్వహిస్తున్నారు. దీంతో క్రాంతి బ్యాంక్ చైర్మన్ రాజేశ్వర రావు ఇంట్లోనూ ఐటీ అధికారులు దాడులు ప్రారంభించారు. సీఆర్పీఎఫ్ బలగాల భద్రతను ఉపయోగించి మల్లారెడ్డి ఇళ్లు, ఆఫీసు,
మల్లారెడ్డి విద్యాసంస్థల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. సీఎంఆర్ కాలేజీలోనూ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అదే సమయంలో మల్లారెడ్డి సోదరుడు గోపాల్ రెడ్డి అక్కడి నుంచి పరారయ్యేందుకు ప్రయత్నించినట్టు సమాచారం. ఈ దాడుల్లో మల్లారెడ్డి ఆస్తులపై ఆరా తీశారు అధికారులు. ఆయనకు ఒక యూనివర్సిటీ, 38 ఇంజనీరింగ్ కాలేజీలు, 6 పాఠశాలలు, పెట్రోల్ బంక్స్, షాపింగ్ మాల్స్, భూములు, ఇతర ఆస్తులు ఉన్నట్టు అధికారులు గుర్తించారు.