Dharani Portal : ధరణి పోర్టల్ మల్లారెడ్డి కోసం పెట్టావంటూ కేసీఆర్ పై సంచలన కామెంట్స్ చేసిన వి.హనుమంతరావు..!! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Dharani Portal : ధరణి పోర్టల్ మల్లారెడ్డి కోసం పెట్టావంటూ కేసీఆర్ పై సంచలన కామెంట్స్ చేసిన వి.హనుమంతరావు..!!

Dharani Portal : బీఆర్ఎస్ ప్రభుత్వం పై కాంగ్రెస్ మాజీ ఎంపీ వి.హనుమంతరావు కీలక వ్యాఖ్యలు చేశారు. పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం అందర్నీ మోసం చేసిందని ఆయన అన్నారు. పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ నేతలను ఇబ్బంది పెట్టిందని, కేసీఆర్ దళిత ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి మాట తప్పారని అన్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని అంటున్నారు. ఒకసారి కర్ణాటక వెళ్లి చూడండి అని వి.హనుమంతరావు పేర్కొన్నారు. బీఆర్ఎస్, బీజేపీ […]

 Authored By anusha | The Telugu News | Updated on :1 January 2024,10:00 pm

ప్రధానాంశాలు:

  •  Dharani Portal : ధరణి పోర్టల్ మల్లారెడ్డి కోసం పెట్టావంటూ కేసీఆర్ పై సంచలన కామెంట్స్ చేసిన వి.హనుమంతరావు..!!

Dharani Portal : బీఆర్ఎస్ ప్రభుత్వం పై కాంగ్రెస్ మాజీ ఎంపీ వి.హనుమంతరావు కీలక వ్యాఖ్యలు చేశారు. పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం అందర్నీ మోసం చేసిందని ఆయన అన్నారు. పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ నేతలను ఇబ్బంది పెట్టిందని, కేసీఆర్ దళిత ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి మాట తప్పారని అన్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని అంటున్నారు. ఒకసారి కర్ణాటక వెళ్లి చూడండి అని వి.హనుమంతరావు పేర్కొన్నారు. బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు నెలలు కూడా ఉండదని వ్యాఖ్యలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది అది ఏమైందని కిషన్ రెడ్డిని వి.హనుమంతరావు ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో అని హామీలు పూర్తి చేసాం. ఇప్పటికే రెండు హామీలు అమలు చేసాం అని వి. హనుమంతరావు స్పష్టం చేశారు.

మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని అమలు చేశాం. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కాంగ్రెస్ కల్చర్ అని హనుమంతరావు అన్నారు. కాంగ్రెస్ పేదలకు భూములు ఇస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం వాటిని తీసుకుంది. కేవలం ధనవంతులకు మాత్రమే బీఆర్ఎస్ న్యాయం చేసిందని అన్నారు. కేసీఆర్ ఇంటికో ఉద్యోగం మూడెకరాల భూమి అన్నారు. కానీ ఇవ్వలేదు. ధరణి పోర్టల్ ద్వారా భూములు లాగేశారు. దానిని రద్దు చేయాలి. అలాగే రెవెన్యూ శాఖలో తప్పులు జరిగాయి. ప్రభుత్వం పడిపోతుందనే స్టేట్మెంట్పై బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు కామెంట్ చేయవద్దు. ప్రజలు కాంగ్రెస్ను నమ్మారు కాబట్టే సోనియాగాంధీ తెలంగాణ వచ్చారు అని హనుమంతరావు స్పష్టం చేశారు.

ఆ ధరణి పోర్టల్ ద్వారా ధనవంతులు బాగుపడ్డారు. పేద ప్రజలకు అన్యాయం జరిగిందని ఆ ధరణి పోర్టల్ ని రద్దు చేయాలని హనుమంతరావు తెలిపారు. కేసిఆర్ ప్రభుత్వం ప్రజలను అన్యాయం చేసిందని వారి భూములు లాగేసుకుని ఆస్తులన్నీ వెనకేసుకున్నారని పేర్కొన్నారు. తెలంగాణలో ఇంటికొక ఉద్యోగం ఇస్తామని ఒక్కరికి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వలేదని ఆయన విమర్శించారు. ప్రజలను ఇబ్బంది పెట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వం అందుకే ఓడిపోయిందని, ప్రజల మనసులను గెలుచుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ కావాలని కోరుకున్నారు. అందుకే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఆయన తెలిపారు.

anusha

డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక