YS Jagan Mohan Reddy : వైయస్సార్ హయాంలో ఆ తర్వాత వైయస్ జగన్ విషయంలో ఈనాడు పత్రిక వ్యతిరేక కథనాలతో ఎప్పుడు ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తూ ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఈ పత్రిక విషయంలో ఆనాడు దివంగత వైయస్సార్ ఇప్పుడు వైఎస్ జగన్ కూడా చట్టసభలలో.. బహిరంగ సభలలో చాలాసార్లు నెగిటివ్ కామెంట్లు చేసిన సందర్బాలు ఉన్నాయ్. ఈ క్రమంలో ఈనాడు గ్రూప్ సంస్థలకు సంబంధించి మార్గదర్శి చిట్ ఫండ్ కేస్ ఎప్పటినుండో నడుస్తూ ఉన్నా గాని ఇటీవల జగన్ ప్రభుత్వం గట్టిగా ఫోకస్ పెట్టడం జరిగింది. దీనిలో భాగంగా మార్గదర్శి అక్రమాల

కేసులో సుప్రీంకోర్టులో అఫిడవిట్ జగన్ ప్రభుత్వం దాఖలు చేయడం జరిగింది. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా మార్గదర్శి చిట్ ఫండ్స్ కార్యాలయాలపై దాడులకు దిగింది. ఈ క్రమంలో పలుచోట్ల మార్గదర్శి కార్యాలయాల మేనేజర్లను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచి రిమాండ్ కు కూడా పంపడం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా మార్గదర్శి చిట్ ఫండ్స్ కార్యాలయాలపై పెద్ద ఎత్తున అధికారులు జరిపిన దాడుల్లో నిబంధనలకు విరుద్ధంగా చీటీల వ్యవహారం జరుగుతున్నట్లు అధికారులు గుర్తించినట్లు అందువల్లే అరెస్టులు చేయడం జరిగింది.
ఈ చిట్ ఫండ్స్ వ్యవహారంలో ఏ1గా రామోజీరావును, ఏ2గా ఆయన కోడలు శైలజను చేర్చారు. పరిస్థితి ఇలా ఉంటే మార్గదర్శి మీద జగన్ ప్రభుత్వం మరో పిడుగు పడే తరహా నిర్ణయం తీసుకుంది. మేటర్ లోకి వెళ్తే మార్గదర్శి చిట్ ఫండ్స్ సంస్థల నేలకొన్న అక్రమాలను వెలుగులోకి తీసుకొచ్చేందుకు ప్రత్యేక ఆడిటింగ్ కోసం స్పెషల్ ఆడిటర్ నీ ఏపీ ప్రభుత్వం నియమించింది. సంస్థలో నిధుల మళ్లింపు మరియు అక్రమ డిపాజిట్ల సేకరణ తదితరాంశాలపై సమగ్రంగా వివరాలు రాబట్టేందుకు ఈ స్పెషల్ ఆడిటర్ నీ నియమించినట్లు సమాచారం.