YS Jagan : 55 లక్షల కుటుంబాల ఓట్లు రాత్రికి రాత్రి జగన్ వైపు !
YS Jagan : ఏపీలో ఎన్నికలకు ఇంకా సంవత్సరం సమయం ఉంది. ఈనేపథ్యంలో ఇప్పటి నుంచే ప్రధాన పార్టీలన్నీ ఇప్పటి నుంచే ఎన్నికలకు సమాయాత్తం అవుతున్నాయి. దానిలో భాగంగా ఏపీ ప్రభుత్వం పలు పథకాలను ప్రవేశపెడుతోంది. ఏపీ ప్రజల కోసం, వాళ్ల సంక్షేమం కోసం ఇప్పటి వరకు సీఎం జగన్ చాలా పథకాలను ప్రారంభించినా.. ఈసారి వైసీపీ పార్టీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జగనన్నే మా భవిష్యత్తు అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది.
ఈ కార్యక్రమానికి అన్ని వర్గాల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఎమ్మెల్యేల దగ్గర్నుంచి నియోజకవర్గాల సమన్వయ కర్తలు, ప్రజా ప్రతినిధులు, సచివాలయాల కన్వీనర్లు, వాలంటీర్లు.. ప్రతి ఒక్కరు ప్రతి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను కలిసి వాళ్లతో ప్రభుత్వం నుంచి వస్తున్న సంక్షేమ పథకాలపై ఆరా తీస్తున్నారు.ప్రతి ఇంటికి వెళ్లి.. వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి సీఎం జగన్ ఏపీలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, టీడీపీ సర్కార్ ఏం చేసింది..
YS Jagan : టీడీపీ సర్కార్ ఏం చేసింది? జగనన్న ప్రభుత్వం ఏం చేస్తోంది?
జగనన్న సర్కార్ ఏం చేస్తోంది.. రెండు ప్రభుత్వాల మధ్య ఉన్న తేడా ఏంటి.. అనేవి వివరిస్తూ కరపత్రాలను పంచుతున్నారు. ఈనేపథ్యంలో ఎవరి నోట విన్నా.. మళ్లీ వైఎస్సార్సీపీనే గెలిపించి.. సీఎంగా మళ్లీ వైఎస్ జగన్ నే గెలిపిస్తామని.. జగనన్న నువ్వే మా నమ్మకం అంటూ ప్రజలు నినదిస్తున్నారు. జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం పదో రోజు ముగిసింది. ఇప్పటి వరకు 73 లక్షల కుటుంబాలను జగనన్న సైన్యం కలిసింది. ఇప్పటి వరకు జగన్ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ 55 లక్షల కుటుంబాలు నెంబర్ కు మిస్డ్ కాల్స్ ఇచ్చారు. అంటే.. 55 లక్షల కుటుంబాల ఓట్లు జగనన్న వైపు ఉన్నట్టే కదా. వైసీపీ వైపు ఉన్నట్టే.