అలర్ట్ : వెంటనే మీ బ్యాంక్ అకౌంట్ తో ఆధార్ ను లింక్ చేసుకోకపోతే.. 2 లక్షలు నష్టపోతారు?
ప్రస్తుత తరుణంలో బ్యాంక్ అకౌంట్ అనేది చాలా ముఖ్యం. బ్యాంక్ అకౌంట్ లేకుండా ఎవ్వరూ ఉండరు. ఆన్ లైన్ లావాదేవీలు చేయాలన్నా.. డబ్బులు బ్యాంకులో దాచుకోవాలన్నా బ్యాంక్ అకౌంట్ ఉండాల్సిందే. ప్రస్తుతం టెక్నాలజీ పెరిగింది.. ఎక్కువగా లావాదేవీలు కూడా ఆన్ లైన్ లో జరుగుతున్నాయి. అందుకే ప్రతి ఒక్కరు బ్యాంక్ అకౌంట్ ను తీసుకుంటున్నారు. అయితే.. చాలా బ్యాంకులు వినియోగదారుల కోసం అకౌంట్ ను క్రియేట్ చేస్తున్నా.. మినిమమ్ బ్యాలెన్స్ మెయిన్ టెన్ చేయాల్సి ఉంటుంది. దీంతో చాలా మంది బ్యాంక్ అకౌంట్ తీసుకోవడానికి వెనుకడుగు వేస్తున్నారు. అందుకే.. కేంద్ర ప్రభుత్వం.. పేదల కోసం జీరో బ్యాలెన్స్ తో జన్ ధన్ ఖాతాను తీసుకొచ్చింది. జన్ ధన్ ఖాతా కింద దేశంలోని పేద ప్రజలు ఏ బ్యాంకులో అయినా జీరో బ్యాలెన్స్ తో అకౌంట్ తీసుకునే విధంగా వెసులుబాటును కేంద్రం కల్పించింది.
జన్ ధన్ ఖాతా వల్ల చాలా లాభాలు ఉన్నాయి. జన్ ధన్ ఖాతా కలిగిన వారికి ఉచితంగా రూపే డెబిట్ కార్డును బ్యాంకులు అందిస్తున్నాయి. అలాగే.. ఈ కార్డు మీద 2 లక్షల రూపాయల వరకు ఉచితంగా యాక్సిడెంటల్ ఇన్సురెన్స్ ను కల్పిస్తోంది. రూపాయి కట్టకున్నా… రూపే డెబిట్ కార్డుతో 2 లక్షల రూపాయల ఇన్సురెన్స్ కు బ్యాంకులు కల్పిస్తున్నాయి.
అయితే.. జన్ ధన్ ఖాతా ఇదివరకే తీసుకొని ఉన్నవాళ్లు.. వెంటనే ఆధార్ కార్డుతో వాళ్ల అకౌంట్ ను లింక్ చేసుకోవాలి. ఇదివరకే అకౌంట్ తో ఆధార్ ను లింక్ చేసుకొని ఉంటే సమస్య లేదు కానీ.. ఇప్పటి వరకు ఆధార్ కార్డుతో బ్యాంక్ ఖాతాను లింక్ చేసుకోకపోతే మాత్రం.. రూపే డెబిట్ కార్డుపై అందించే యాక్సిడెంటల్ ఇన్సురెన్స్ బెనిఫిట్ ఉండదు. దీంతో మీరు 2 లక్షల రూపాయలు నష్టపోయినట్టే.
యాక్సిడెంటల్ ఇన్సురెన్స్ తో పాటు లైఫ్ ఇన్సురెన్స్ కూడా
జన్ ధన్ ఖాతా ఉన్న వాళ్లకు యాక్సిడెంటల్ ఇన్సురెన్స్ తో పాటు లైఫ్ ఇన్సురెన్స్ ను కూడా బ్యాంకులు కల్పిస్తున్నాయి. దీని వల్ల 30 వేల రూపాయల వరకు బీమా లభిస్తుంది. జన్ ధన్ ఖాతా కలిగిన వాళ్లు.. ఏదైనా కారణం చేత మరణించినా.. సహజంగా మరణించినా వాళ్ల కుటుంబానికి 30 వేల రూపాయలను బ్యాంకులు అందిస్తాయి. జన్ ధన్ ఖాతా ద్వారా లైఫ్ ఇన్సురెన్స్ పొందాలంటే కూడా ఖచ్చితంగా ఆధార్ ను అకౌంట్ తో లింక్ చేసుకోవాలి.
అందుకే.. జన్ ధన్ ఖాతా ఉన్నవాళ్లు.. వెంటనే సంబంధిత బ్యాంకుకు వెళ్లి ఆధార్ తో తమ ఖాతాను లింక్ చేసుకోవాలి. లేకపోతే.. అనవసరంగా 2.3 లక్షల రూపాయల వరకు ఊరికే నష్టపోవాల్సి వస్తుంది. ఇదివరకు ఆధార్ ను లింక్ చేసుకున్న వాళ్లు మరోసారి లింక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు తమ జన్ ధన్ బ్యాంక్ ఖాతాను లింక్ చేయని వాళ్లు మాత్రమే వెంటనే బ్యాంకుకు వెళ్లి ఆధార్ ను లింక్ చేసుకోవాల్సి ఉంటుంది.