Bank Account : ఎక్కువ రోజులు లావాదేవీలు లేని బ్యాంక్ ఖాతాలు క్లోజ్.. ఇలా చేయాల్సిందే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Bank Account : ఎక్కువ రోజులు లావాదేవీలు లేని బ్యాంక్ ఖాతాలు క్లోజ్.. ఇలా చేయాల్సిందే..!

 Authored By ramu | The Telugu News | Updated on :21 November 2024,6:00 pm

ప్రధానాంశాలు:

  •  Bank Account : ఎక్కువ రోజులు లావాదేవీలు లేని బ్యాంక్ ఖాతాలు క్లోజ్.. ఇలా చేయాల్సిందే..!

Bank Account : ఒకప్పుడు ఒక వ్యక్తికి ఒక బ్యాంక్ ఖాతా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కో వ్యక్తికి ఎక్కువ సంఖ్యలో బ్యాంక్ ఖాతాలు ఉంటున్నాయి. ఐతే అలా ఎక్కువ బ్యాంక్ లు ఉన్న బ్యాంక్ ఖాతాల్లో కొన్నిటిని మాత్రమే ఆడుతూ మిగతా వాటిని పట్టించుకోరు. అలాంటి బ్యాంక్ ఖాతాలను క్లోజ్ చేస్తున్నాయి బ్యాంకులు. నిష్క్రియంగా ఉన్న ఖాతాలను బ్యాంకులు మూసివేసే ప్రమాదం ఉంది. ఐతే వాటిని తిరిగి యాక్టివేట్ చేయాలి లేదా అకౌంట్ క్లోజ్ చేసుకోవాలి. బ్యాంక్ ఖాతా నిర్ధిష్ట వ్యవధిలో లావాదేవీలు, డిపాజిట్లు లేకపోతే ఆర్ధిక కార్యకలాపాల వంటివి జరగకపోతే బ్యాంక్ ఖాతాలను నిష్రియంగా వర్గాకెరిస్తారు. అలాంటి వాటికి 12 నెలల నియమం పెట్టి ఆ తర్వాత వాటిని ఇన్ యాక్టివ్ అకౌంట్ లుగా మారుస్తారు.

Bank Account ఎక్కువ రోజులు లావాదేవీలు లేని బ్యాంక్ ఖాతాలు క్లోజ్ ఇలా చేయాల్సిందే

Bank Account : ఎక్కువ రోజులు లావాదేవీలు లేని బ్యాంక్ ఖాతాలు క్లోజ్.. ఇలా చేయాల్సిందే..!

Bank Account కొన్ని బ్యాంకులు 6 నెలలు మాత్రమే..

దీనికి సంబందించిన వ్యవధిలో నిష్రియం అయిన బ్యాంక్ ఖాతాదారులకు తెలియచేస్తారు. ఐతే నోటిఫికేషన్ తర్వాత ఖాతా నిష్రియగా ఉంటే ఆ అకౌంట్ ను మూసేసే ఛాన్స్ ఉంటుంది. కొన్ని బ్యాంకులు 6 నెలలు నిష్క్రియం తర్వాత ఖాతాలను డీయాక్టివేట్ చేస్తాయి. ఇతర బ్యాంకులు 12 నెలల ఇన్ యాక్టివిటీ నియమాలను అనుసరించి ఖాతా క్లోజ్ చేస్తాయి. ఇన్ యాక్టివ్ అకౌంట్ లకు జరిమానా ఉండదు కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం నిష్రియలో ఉన్న ఖాతా కనీస నిల లేనందున జరిమానాలు ఉండవు కానీ ఖాతా హోల్డ్ లో ఉంటుంది. అంటే ఖాతాలో ఉన్న డబ్బుని తీయలేరు.. డిపాజిట్ కూడా చేయలేరు.

కొన్ని బ్యాంకులు నిష్క్రియ ఖాతాలు మళ్లీ యాక్టివ్ చేసేందుకు మినిమం ఛార్జెలు వసూలు చేస్తాయి. నిష్క్రియ బ్యాంక్ ఖాతాలు తిరిగి రీ యాక్టివేట్ చేసుకోవాలని అనుకుంటే వారు ఖాతా తెరచిన బ్యాంక్ కి వెళ్లి.. పూర్తి కే.వై.సీ చేసి మరోసారి ఆధార్, పాన్ కార్డ్ అప్డేట్ చేయాలి. ఐతే బ్యాంక్ ఖాతాను రీ యాక్టివేట్ చేయాలనుకున్నప్పుడు ఇన్ని రోజులు ఎందుకు ఈ ఖాతా వాడబడలేదు అన్నది బ్యాంక్ ఉద్యోగులకు ఒక లెటర్ ద్వారా రాసి ఇవ్వాల్సి ఉంటుంది.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది