Janasena : జనసేనాని బస్సు యాత్రకు దక్కని పబ్లిసిటీ.. సినిమా ప్రమోషన్ సరిపోలేదు
Janasena : ఈ ఏడాది దసరా నుండి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టాడు. పార్టీ పెట్టి ఎనిమిది ఏళ్లు పూర్తి అయినా కూడా పూర్తి స్థాయిలో జనాల్లోకి పార్టీని తీసుకు వెళ్లడంలో పవన్ కళ్యాన్ పూర్తిగా విఫలం అయ్యారు. ఎట్టకేలకు ఆయన పార్టీని జనంలోకి తీసుకు వెళ్లి వచ్చే ఎన్నికల్లో గౌరవం కాపాడుకోవాలనే పట్టుదలతో ఉన్నట్లుగా ఉన్నాడు. అందుకే బస్సు యాత్ర ద్వారా జనాలను కలవాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నాడు. అందుకు సంబంధించిన హడావుడి మొదలు పెట్టారు. వారి వారి మీడియాల్లో బస్సు యాత్రకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయి.
జనసేన పార్టీ నాయకత్వం బస్సు యాత్ర నిర్వహించడం ఆ పార్టీ కార్యకర్తలు మరియు నాయకులు ఉత్సాహంగా ఉన్నారు. ఎనిమిది కొత్త వెయికిల్స్ ను ఇటీవలే కొనుగోలు చేసి వాటిని సినిమాలో మాదిరిగా రఫ్.. రఫ్ అంటూ రోడ్డు మీద తిప్ప వీడియోలను విడుదల చేయడం జరిగింది. అంతే కాకుండా జనసేన కార్యకర్తలు జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రజల్లోకి రాబోతున్నాడు అంటూ చాలా యాక్టివ్ గా ప్రచారం చేసేందుకు ప్రయత్నాలు చేశారు. వారి ప్రయత్నాలు పెద్దగా ఫలించడం లేదు.
ఇప్పటి వరకు కూడా జనసేనాని బస్సు యాత్ర గురించి ప్రజల్లో కాని.. రెగ్యులర్ మీడియాలో కాని పెద్దగా చర్చ జరగడం లేదు. జనసేన అధినేత పవన్ కళ్యాన్ ప్రజల్లోకి వచ్చినా మరెక్కడికి వచ్చినా కూడా ఆయన అధికారంలోకి రాలేడు.. ఆయన అధికార పార్టీకి మద్దతు ఇచ్చేన్ని సీట్లను దక్కించుకోలేడు అంటూ విమర్శలు వస్తున్నాయి. జయప్రకాష్ నారాయన్ గారు చెప్పినట్లుగా పవన్ కళ్యాణ్ మూడవ స్థానం కనుక ఆయనకు ఓట్లు వేసినా వృధా అన్నట్లుగా చాలా మంది భావిస్తున్నారు. అందుకే బస్సు యాత్ర గురించి కూడా రాజకీయ వర్గాల వారు కాని.. ఆయన సొంత పార్టీ కార్యకర్తలు కాని ప్రజలు కాని పెద్దగా సీరియస్ తీసుకోవడం లేదు.