JD Laxminarayana : “రెండున్నరేళ్లు పవన్ కళ్యాణ్ సీఎం.. మిగితా సగం” జనసేన – టీడీపీ పొత్తు సీక్రెట్ బయటపెట్టిన జేడీ లక్ష్మీనారాయణ
JD Laxminarayana : అసలు ఏపీలో ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. కానీ.. ఇప్పటి నుంచే ఏపీలో ఎన్నికల హడావుడి మొదలైంది అనే విషయం తెలిసిందే కదా. అందుకే ఏపీలో ఎన్నికల వాతావరణం నెలకొన్నది. మరి.. 2024 ఎన్నికల వరకు ఏపీలో ఎన్నికల పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. అసలు.. ఏ పార్టీ ఎటువైపు మొగ్గు చూపుతుంది. ఏ పార్టీ పొత్తు పెట్టుకుంటుంది. ఏ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుంది అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గానే ఉంది. దానిపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తాజాగా వివరణ ఇచ్చారు.
ఏపీలో ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో ఆయన తాజాగా ఓ యూట్యూబ్ చానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు ఆయన. ఈ సందర్భంగా ఇంటర్వ్యూయర్ జేడీ లక్ష్మీనారాయణను ఓ ప్రశ్న అడిగారు. 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కింగ్ అవుతారా? లేక కింగ్ మేకర్ అవుతారా? అని ప్రశ్నించారు. దీనిపై జేడీ లక్ష్మీనారాయణ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ కింగ్ అవుతారా? లేక కింగ్ మేకర్ అవుతారా? అనేది తెలియదు కానీ.. ఇప్పుడే చెప్పలేం కానీ ఎన్నికల వేళకు పరిస్థితులు ఎలా మారుతాయో చెప్పడం కష్టం అన్నారు. కానీ.. ప్రస్తుతానికి బీజేపీ మాత్రం జనసేన పార్టీ తమతోనే కలిసి ఉంటుందని చెప్పుకుంటోందన్నారు.

jd laxminarayana comments on tdp janasena alliance
JD Laxminarayana : 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కింగ్ అవుతారా?
కానీ.. ప్రస్తుతం చోటు చేసుకుంటున్న పరిణామాలను చూస్తే.. టీడీపీ, జనసేన పార్టీల మధ్య భవిష్యత్తులో పొత్తు ఉన్నా లేకున్నా.. ఒకవేళ బీజేపీతో కలిసి జనసేన, టీడీపీ పోటీ చేసినా అప్పుడు పరిస్థితులు వేరుగా ఉంటాయని ఆయన తెలిపారు. ఒకవేళ టీడీపీ, జనసేన పార్టీ కలిసి పోటీ చేస్తే.. రెండు పార్టీలు కలిసి పోటీ చేసినప్పుడు అధికారంలోకి వస్తే అప్పుడు పవన్ కళ్యాణ్ రెండున్నరేళ్లు ముఖ్యమంత్రగా ఉంటారని, మరో రెండున్నర ఏళ్లు చంద్రబాబు సీఎంగా పనిచేస్తారని, ఇప్పుడే దాని గురించి ఒక అంచనాకు అయితే రాలేం అని వీవీ లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.