Cm Covid Positive : బ్రేకింగ్‌.. సీఎం ఇంట్లో కోవిడ్ కలకలం.. ఏకంగా 15 మందికి పాజిటివ్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Cm Covid Positive : బ్రేకింగ్‌.. సీఎం ఇంట్లో కోవిడ్ కలకలం.. ఏకంగా 15 మందికి పాజిటివ్..!

 Authored By inesh | The Telugu News | Updated on :9 January 2022,12:13 pm

Cm Covid Positive : దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజూ లక్షల్లో నమోదవుతున్న కేసులు.. మహమ్మారి తీవ్రతకు అద్దం పడుతున్నాయి. తాజాగా.. ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ నివాసంలో కరోనా కలకలం రేపింది. ముఖ్యమంత్రి సతీమణితో పాటు వారి ఇద్దరు పిల్లలు సహా మొత్తం 15 మందికి కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇప్పుడీ అంశం ఝార్ఖండ్ లో చర్చనీయాంశంగా మారింది.

జాగ్రత్తలు పాటించే సీఎం ఇంట్లోనే కరోనా కేసులు ఈ స్థాయిలో ఉంటే ఇంకా రానున్న రోజుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో అంచనాలకు అందటం లేదు. స్వల్ప లక్షణాలతో బాధపడుతున్న ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి సతీమణి కల్పనా సోరెన్, కుమారులు నితిన్, విశ్వజీత్ లతో పాటు ఆయన నివాసంలోని మొత్తం 62 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా ఈ మేరకు కేసులు బయట పడినట్లు తెలుస్తోంది. అయితే వారిలో ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్‌కు నెగెటివ్‌గా నిర్ధారణ అయినట్లు అక్కడి వైద్యాధికారులు స్పష్టం చేశారు.

jharkand cm family members tested covid positive

jharkand cm family members tested covid positive

పాజిటివ్ గా తేలిన వారందరికీ స్వల్ప లక్షణాలే ఉండటంతో వారందరూ వైద్యుల పర్యవేక్షణలో హోం ఐసోలేషన్‌లోనే ఉన్నట్లు సమాచారం. భారత్ లో గత మూడు రోజులుగా రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు చేసుకుంటున్నాయి. ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కరోనా బారిన పడి చికిత్స పొందుతున్నారు.

Advertisement
WhatsApp Group Join Now

inesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది