Good News : ఉద్యోగులకు గుడ్ న్యూస్, త్వరలోనే అమల్లోకి రానున్న కొత్త పింఛన్ విధానం..!
Good News : పింఛను,దీనికోసం ప్రభుత్వ ఉద్యోగులే కాకుండా, ప్రైవేట్ ఉద్యోగస్తులు కూడా, ఆరాట పడుతూ ఉంటారు. ఎందుకంటే ఈ పింఛన్ ఉద్యోగి రిటైర్డ అయిన తరువాత వారికి జీవనాధారంగా మారుతుంది. ఈ పింఛన్ తోనే వారు మిగిలిన వారి జీవితాన్ని గడుపుతారు. పెన్షన్ వయస్సు 65 సంవత్సరాలు కాగా దాన్ని ఇప్పుడు 60 సంవత్సరాలకు మార్చారు. దీంతో ఉద్యోగస్తులు సంతోష పడుతున్నారు. అలాంటి పెన్షన్ గురించి ఒక సమాచారం అందింది అది ఏంటంటే..దేశంలోని ఉద్యోగులు ఎప్పుడెప్పుడా అని చూస్తున్నా ఆ చక్కటి శుభవార్త ఇప్పుడు వినిపించబోతోంది.
ఉద్యోగుల పట్ల, వారి భవిష్యత్తు పట్ల, ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఒక నిర్ణయాన్ని తీసుకుంది. ఆ నిర్ణయం ఏమనగా సంఘటిత రంగంలోని కార్మికులకు కొత్త పింఛన్ విధానాన్ని తీసుకువచ్చేందుకు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఆలోచనలను మొదలు పెట్టింది అయితే నెలవారి జీతం 15000 కంటే ఎక్కువ వేతనాన్ని కోరుతూ.. 1995 లో ఉద్యోగుల పింఛన్ పథకం లో లేని వారి కోసం ఈ పథకాన్ని వర్తింపజేయాలని ఆలోచనలో ఉన్నట్టు సంబంధిత వర్గాలు తెలుపుతున్నాయి. దాంతో ఎవరైతే ప్రస్తుతం సంఘటిత రంగంలో చేరేనాటికి వారి జీవితం 15000 వరకు వేతనం పొందే వారంతా ఈపిఎస్ 95 పరిధి లోకి వస్తున్నారు అని సంబంధిత వర్గాలు తెలియజేస్తాయి. కావునఎక్కువ మొత్తం జమ చేస్తే ఎక్కువ పింఛన్ పొందే వీలు ను కల్పించాలంటూ ఉద్యోగుల డిమాండ్లు వినిపిస్తున్నాయి.
Good News : త్వరలోనే కొత్త పింఛన్ పథకం అమలు..
ఇక ఇప్పుడు ఈ ఉద్యోగుల పింఛన్ సమస్యకు కొత్త పింఛన్ పథకాన్ని తీసుకువచ్చే అంశం పరిశీలనలో ఉందని సంబంధిత వర్గాలు తెలియజేస్తున్నాయి. కావున ఈ కొత్త పెన్షన్ పథకం ప్రతిపాదన పైన గుహటీలో మార్చి 11,12 తేదీల్లో జరగనున్న సమావేశంలో ఈ కొత్త పింఛన్ చర్చ కూడా చర్చనీయాంశాలు ఒకటిగా ఉందని ఈ చర్చ గురించి సరైన నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలియజేస్తున్నాయి.ఈ సమాచారం ఉద్యోగులకు వారి కొత్త పింఛన్ మీద నమ్మకాన్ని తీసుకువచ్చే అంశంగా మారింది.