Jr NTR : బలవంతంగా ఐనా జూనియర్ ఎన్టీఆర్ ని జగన్ వైపు లాగుతున్నారు.. చంద్రబాబుకి ఈ మ్యాటర్ తెలుసా?
Jr NTR : ఆర్ఆర్ఆర్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం టాలీవుడ్ కో లేక బాలీవుడ్ కో చెందిన సినిమా కాదు ఇది. ప్రపంచ మొత్తం ఈ సినిమాను చూసి అబ్బురపడుతోంది. ఒక భారతీయ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సంచలనాలు సృష్టించడం ఇదే తొలిసారి. బాహుబలి సిరీస్ తో జక్కన ప్రపంచానికే తన సత్తా ఏంటో నిరూపించాడు. ఆర్ఆర్ఆర్ సినిమాతో భారతీయ సినిమా శక్తి ఏంటో పూర్తిగా ప్రపంచానికి తెలిసింది. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరు హీరోలుగా నటించిన విషయం తెలిసిందే. అయితే.. ఎంతో ప్రఖ్యాతమైన హాలీవుడ్ సినిమాలకే ఇచ్చే ఆస్కార్ అవార్డు రేస్ లో ఇప్పుడు ఆర్ఆర్ఆర్ ఉన్నట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ లేదంటే రామ్ చరణ్ ఇద్దరిలో ఒకరు ఆస్కార్ అవార్డును అందుకోవడం ఖాయం అని సోషల్ మీడియా కోడై కూస్తోంది. వెరైటీ అనే ఓ వెబ్ సైట్ ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయినట్లు ఓ కథనం వెల్లడించింది.
2023 ఆస్కార్ అవార్డుల ఎంపిక కోసం ఆర్ఆర్ఆర్ నామినేట్ అయిందని… మూడు కేటగిరీల్లో ఈ సినిమా నామినేట్ అయినట్టు కథనంలో పేర్కొంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్(దోస్తీ) ఒక కేటగిరి, బెస్ట్ యాక్టర్ ( జూనియర్ ఎన్టీఆర్ – రామ్ చరణ్), అలాగే బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలిం కేటగిరీలలో ఈ సినిమా నామినేషన్స్ లో ఉందని తెలిపింది.
Jr NTR : వచ్చే సంవత్సరం మార్చి 12న ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం
ఆస్కార్ అవార్డుల వేడుక వచ్చే సంవత్సరం మార్చి 12న జరగనుంది. ఇంకా 6 నెలల సమయం ఉంది. అయినప్పటికీ ఓవైపు రామ్ చరణ్, మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియాలో తమ హీరోలకు ఆస్కార్ అవార్డు వచ్చేసినట్టే అన్న రేంజ్ లో ప్రచారం చేస్తున్నారు. దీనిపై వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయిరెడ్డి కూడా స్పందించారు. ఆర్ఆర్ఆర్ మూవీ ఆస్కార్ కోసం ఎంపికైన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. దానికి సంబంధించి ట్వీట్ చేశారు. ఆస్కార్ బరిలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఉండొచ్చన్న హాలీవుడ్ మ్యాగజైన్ అంచనాలు మన తెలుగు చిత్ర స్థాయిని చాటిచెబుతున్నాయి. గిరిపుత్రులు బ్రిటీష్ వారిపై జరిపిన పోరాటమే ఇతివృత్తంగా సాగిన ఈ చిత్రం ఖచ్చితంగా ఆస్కార్ సాధిస్తుందని ఆశిస్తున్నా అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.