Jr NTR : అమిత్ షా తో జూనియర్ ఎన్‌టి‌ఆర్ మాట్లాడబోయే మొట్టమొదటి టాపిక్ ఇదే ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Jr NTR : అమిత్ షా తో జూనియర్ ఎన్‌టి‌ఆర్ మాట్లాడబోయే మొట్టమొదటి టాపిక్ ఇదే !

Jr NTR : బీజేపీ మునుగోడు సభ ఇవాళే అని తెలుసు కదా. ఈ సభకు బీజేపీ ముఖ్య నేతలంతా తరలి వస్తున్నారు. ఈనేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా ఒక న్యూస్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. మనుగోడు సభకు జూనియర్ ఎన్టీఆర్ కు ఆహ్వానం అందిందట. అవును.. అసలు బీజేపీకి, జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధమే లేదు. మునుగోడుతోనూ జూనియర్ ఎన్టీఆర్ కు ఎలాంటి సంబంధం లేదు. కానీ.. అమిత్ షాతో జూనియర్ ఎన్టీఆర్ భేటీ కానున్నారనే వార్తలు […]

 Authored By jagadesh | The Telugu News | Updated on :21 August 2022,6:20 pm

Jr NTR : బీజేపీ మునుగోడు సభ ఇవాళే అని తెలుసు కదా. ఈ సభకు బీజేపీ ముఖ్య నేతలంతా తరలి వస్తున్నారు. ఈనేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా ఒక న్యూస్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. మనుగోడు సభకు జూనియర్ ఎన్టీఆర్ కు ఆహ్వానం అందిందట. అవును.. అసలు బీజేపీకి, జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధమే లేదు. మునుగోడుతోనూ జూనియర్ ఎన్టీఆర్ కు ఎలాంటి సంబంధం లేదు. కానీ.. అమిత్ షాతో జూనియర్ ఎన్టీఆర్ భేటీ కానున్నారనే వార్తలు ప్రస్తుతం గుప్పుమంటున్నాయి. నిజానికి.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు పలువురు ముఖ్యనేతలు ఇవాళ మునుగోడులో జరగబోయే సభకు హాజరయ్యారు. కానీ.. జూనియర్ ఎన్టీఆర్ తో ప్రత్యేకంగా సమావేశం కానున్నారట అమిత్ షా.

Jr NTR : ప్రత్యేకంగా డిన్నర్ మీట్

ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో ఎన్టీఆర్ నటనను అందరూ మెచ్చుకుంటున్నారు. ఆస్కార్ కు కూడా జూనియర్ ఎన్టీఆర్ నామినేట్ అయ్యారు.. ఎన్టీఆర్ నటన నచ్చి.. అమిత్ షా హైదరాబాద్ లో జూనియర్ ఎన్టీఆర్ తో ప్రత్యేకంగా సమావేశం కానున్నట్టు తెలుస్తోంది. అందుకే ప్రత్యేకమైన డిన్నర్ మీట్ కు జూనియర్ ఎన్టీఆర్ ను ఆహ్వానించినట్టు తెలుస్తోంది.

Jr Ntr to attend bjp munugodu meeting with Amit Shah

Jr Ntr to attend bjp munugodu meeting with Amit Shah

కానీ.. అదంతా కాదు.. రాజకీయ ఎత్తుగడలో భాగంగానే జూనియర్ ఎన్టీఆర్ తో అమిత్ షా సమావేశం కానున్నారని వార్తలు వస్తున్నాయి. ఏపీ, తెలంగాణలో అధికారం కోసం బీజేపీ చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే జూనియర్ ఎన్టీఆర్ తో అమిత్ షా సమావేశం అవుతున్నారని వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా.. తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్, అమిత్ షా భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. భేటీ తర్వాత అసలు వీళ్లిద్దరి మధ్య ఏం జరిగిందో తెలియనుంది.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది