Kadiyam Srihari : వరంగల్ టీఆర్ఎస్ లో ఆదిపత్యపోరు.. ఎమ్మెల్యే రాజయ్యపై కడియం సంచలన వ్యాఖ్యలు? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Kadiyam Srihari : వరంగల్ టీఆర్ఎస్ లో ఆదిపత్యపోరు.. ఎమ్మెల్యే రాజయ్యపై కడియం సంచలన వ్యాఖ్యలు?

 Authored By jagadesh | The Telugu News | Updated on :21 March 2021,1:08 pm

Kadiyam Srihari : ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తుల జ్వాలలు బాగానే రగులుతున్నాయి. ముఖ్యంగా వరంగల్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ నాయకుల్లో ఆదిపత్య పోరు జోరుగా సాగుతోంది. గతంలో మంత్రగా పనిచేసిన కడియం శ్రీహరి.. కాస్త దూకుడుగానే ఉన్నారు. 2014 లో తెలంగాణలో మొదటి సారి టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక.. వరంగల్ జిల్లా టీఆర్ఎస్ నేతలైన కడియం శ్రీహరి, తాడికొండ రాజయ్యకు సీఎం కేసీఆర్ మంచి ప్రాధాన్యత ఇచ్చారు. మంత్రి పదవితో పాటు.. డిప్యూటీ సీఎం పదవిని కూడా ఇచ్చారు. కానీ.. కొన్ని రోజులకే తాడికొండ రాజయ్య అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు రావడంతో.. రాజయ్య మంత్రి పదవి పోయింది.

kadiyam srihari shocking comments on tadikonda rajaiah

kadiyam srihari shocking comments on tadikonda rajaiah

అయితే.. 2018 ఎన్నికల వరకు కూడా కడియం శ్రీహరి మంత్రిగా పనిచేశారు. కానీ.. రెండో సారి గెలిచాక మాత్రం కేసీఆర్.. కడియం శ్రీహరిని పక్కన పెట్టేశారు. వరంగల్ జిల్లా నుంచి ఖచ్చితంగా ఒక టీఆర్ఎస్ నాయకుడికి మంత్ర పదవి ఇవ్వాలి. అయితే.. 2018 ఎన్నికల ముందు పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు.. టీఆర్ఎస్ పార్టీలో చేరడం, 2018 ఎన్నికల్లో గెలవడంతో.. మంత్రి పదవి ఎర్రబెల్లికి పోయింది. దీంతో కడియాన్ని పక్కన పెట్టారు కేసీఆర్.

Kadiyam Srihari : కడియం, రాజయ్య మధ్య భగ్గుమంటున్న పచ్చగడ్డి

నిజానికి.. వరంగల్ జిల్లాలోని ముఖ్య నేతల్లో ఒకరంటే మరొకరికి పడదు. ఎర్రబెల్లి, కడియం శ్రీహరికి మధ్య కూడా వైరం ఉంది. ఎర్రబెల్లి ప్రస్తుతం మంత్రగా ఉండటంతో.. కడియం కూడా సైలెంట్ అయ్యారు. కానీ.. స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాడికొండ రాజయ్యను మాత్రం కడియం వదలడం లేదు. చాలాఏళ్ల నుంచి వీళ్లిద్దరి మధ్య వైరం ఉన్న విషయం తెలిసిందే.

స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో తమ పట్టు ఉండాలని ఇద్దరూ ప్రయత్నిస్తున్నారు. దీంతో ఇద్దరి మధ్య గొడవలు ముదురుతున్నాయి. తాజాగా తాడికొండ రాజయ్యపై కడియం శ్రీహరి విరుచుకుపడ్డారు.

ఒక్క రూపాయి సాయం చేయలేనివాడు.. చేతకానివాడు… కూడా మాట్లాడుతున్నాడా? చెల్లని రూపాయి. నేను మంత్రిగా ఉన్నప్పుడు కానీ.. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ.. ఒక్కరి దగ్గర చాయ్ తాగినట్టు.. పదవి ఇప్పిస్తానని. పనులు చేసి పెడతానని రూపాయి తీసుకున్నట్టు నిరూపిస్తారా? అలా నిరూపిస్తే.. ఇప్పుడే ముక్కు నేలకు రాస్తా అంటూ రాజయ్యకు కడియం సవాల్ విసిరారు. పదవులు అమ్ముకునేది మీరు.. పనులు అమ్మకునేది మీరు. నెత్తి మీద 10 రూపాయలు పెట్టినా.. అమ్ముడుపోనివాళ్లు కూడా మాట్లాడుతున్నారా? అంటూ కడియం ఎద్దేవా చేశారు.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది