Kadiyam Srihari : నాపై త‌ప్పుడు ఆరోప‌ణ‌లు.. దీనిపై వివ‌ర‌ణ ఇవ్వాలంటే సిగ్గుగా ఉంది : క‌డియం | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Kadiyam Srihari : నాపై త‌ప్పుడు ఆరోప‌ణ‌లు.. దీనిపై వివ‌ర‌ణ ఇవ్వాలంటే సిగ్గుగా ఉంది : క‌డియం

 Authored By ramu | The Telugu News | Updated on :8 April 2025,7:00 pm

ప్రధానాంశాలు:

  •  Kadiyam Srihari : నాపై త‌ప్పుడు ఆరోప‌ణ‌లు.. దీనిపై వివ‌ర‌ణ ఇవ్వాలంటే సిగ్గుగా ఉంది : క‌డియం

Kadiyam Srihari : ప్ర‌స్తుతం తెలంగాణ రాజ‌కీయాలు కూడా ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్నాయి.స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వ్యాఖ్యలపై జనగామ బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌ రెడ్డి కౌంటరిచ్చారు. కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీ దయతో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన గుంట నక్క అని ఆయన మండిపడ్డారు.తన మీద నమ్మకం ఉంచి తనను గెలిపించిన ప్రజలు, నాయకులను కాపాడుకోవడానికి కాపలా కుక్కలా పనిచేస్తానని వ్యాఖ్యానించారు.

Kadiyam Srihari నాపై త‌ప్పుడు ఆరోప‌ణ‌లు దీనిపై వివ‌ర‌ణ ఇవ్వాలంటే సిగ్గుగా ఉంది క‌డియం

Kadiyam Srihari : నాపై త‌ప్పుడు ఆరోప‌ణ‌లు.. దీనిపై వివ‌ర‌ణ ఇవ్వాలంటే సిగ్గుగా ఉంది : క‌డియం

Kadiyam Srihari కౌంట‌ర్ ఎటాక్..

కాంగ్రెస్ తాను ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని, ఈ విషయంలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని అన్నారు. ప్రజల భూములను కాపాడటంలో రేచు కుక్కలా ఉండి పోరాడతానని ఆయన స్పష్టం చేశారు.నేను అటవీ భూములను ఆక్రమించుకున్నట్లు నాపై తప్పుడు ఆరోపణలు, తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఒకవైపు రైతుల పట్టా భూములు, అటవీ భూములను రక్షించాలని నేను ప్రయత్నిస్తుంటే నాపైనే నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు

ఈ ఆరోపణలకు వివరణ ఇవ్వాలంటే నాకే సిగ్గుగా అనిపిస్తుంది అని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఇక ఇదిలా ఉంటే తన మీద నమ్మకం ఉంచి తనను గెలిపించిన ప్రజలు, నాయకులను కాపాడుకునేందుకు కాపలా కుక్కలా పనిచేస్తానని ప‌ల్లా తెలిపారు. అలవిగాని హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్‌ పార్టీని ప్రశ్నించడంలో, ప్రజల భూములను కాపాడటంలో రేసు కుక్కలా ఉండి పోరాడతానని పేర్కొన్నారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది