తిరుపతి ఉప ఎన్నిక ఎఫెక్ట్.. ఆ ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఖాయం..?
చంద్రబాబు నాయుడును ఢీ కొట్టినందుకు గాను కాకాణి గోవర్థన్ రెడ్డికి మంత్రి పదవి దక్కబోతుంది. తిరుపతి ఉప ఎన్నికల్లో వైకాపా గెలుపులో ఈయన కీలక భూమిక పోషించాడు. రెడ్డి సామాజిక వర్గంకు చెందిన వారు చాలా మంది మంత్రులుగా ఉన్నారు. ఇక కొత్త వారికి మంత్రి పదవి రాకపోవచ్చు అంటున్న సమయంలో కాకాణికి మంత్రి పదవి అంటూ బలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రెండేళ్లు అయిన నేపథ్యంలో మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని అంటున్నారు. కరోనా కారణంగా కాస్త ఆలస్యం అవుతున్న మంత్రి వర్గ విస్తరణ త్వరలోనే ఉంటుందని రాజకీయ విశ్లేషకులు నమ్మకంగా చెబుతున్నారు.
ఎంతో మంది ఉంటే కాకాణికే ఎందుకు..
మంత్రి వర్గంలో స్థానం కోసం ఎంతో మంది ప్రముఖులు బరిలో ఉండగా కాకాణికే ఎందుకు మంత్రి పదవి వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. అందుకు ఒకటే సమాధానం తిరుపతి ఉప ఎన్నికల్లో ఆయన పని తీరుపై మంచి సర్వే రిపోర్ట్ వచ్చింది. ఆయన ప్రాతినిధ్యం వహించిన చోట వైకాపాకు మంచి ఓట్లు దక్కాయి. అందుకే వైకాపా అభ్యర్థి భారీ ఓట్ల మెజార్టీ తో ఘన విజయాన్ని సొంతం చేసుకున్నాడు. కాకాణి మంత్రి పదవి కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆయన ఎదురు చూపులకు బ్రేక్ పడ్డట్లే అంటున్నారు.

Ap CM Ys Jagan
కాకాణికి ఇచ్చి వారికి హెచ్చరిక..
మంత్రి పదవిలో ఉన్న ఇద్దరు లేదా ముగ్గురికి ఉద్వాసన పలికే అవకాశం ఉందంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిపిన సర్వేలో కొందరు నిరాశ పర్చారట. అందుకే వారిని తొలగించి కొత్త వారికి ఛాన్స్ ఇవ్వాలనేది సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆశగా భావిస్తున్నారు. పార్టీ కోసం ప్రజల కోసం పని చేసే వారికి మంత్రి పదవులు ఇవ్వడం ద్వారా జగన్ పార్టీ నాయకత్వంలో ఉత్సాహం నింపడం జరుగుతుంది. పార్టీ కోసం పని చేస్తే ఏదో ఒక సమయంలో అధినేత ఖచ్చితంగా చూస్తాడు మంత్రి పదవి ఇస్తాడని ఎమ్మెల్యేలు నమ్మకంగా ఉన్నారు. కాకాణి విషయంలో అదే జరుగుతుంది. కనుక ఆయన్ను ఇకపై అంతా ఫాలో అయ్యే అవకాశం ఉంది.