Kalvakuntla Kavitha : ఇక తప్పదు.. కవితకు మంత్రి పదవి ఖాయం.. ఆ మంత్రికి పదవి గండం.. ఆయన స్థానంలో మంత్రిగా కవిత?
Kalvakuntla Kavitha : హుజూరాబాద్ ఉపఎన్నిక పోలింగ్ ముగిసిన వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ మరో సంచలన నిర్ణయం తీసుకుంటారన్న టాక్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్ర మంత్రివర్గాన్ని పునర్వ్యవస్తీకరిస్తారా, అంటే పార్టీ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఓటమిని ఉహిస్తున్న కేసీఆర్.. ప్రజలు, పత్రికలు, మీడియా దృష్టిని మరల్చేందుకు ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారని పార్టీవర్గాలు భావిస్తున్నాయి. మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరిగినా, ఈసారి కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బెర్త్ ఖాయమని అంటున్నారు.
నిజానిజాలు ఎలా ఉన్నప్పటికీ, మంత్రి పదవి కోసం అలిగి కొన్ని నెలల పాటు అటు రాజకీయ కార్యక్రమాలకు, ఇటు కుటుంబ వేడుకలకు దూరంగా ఉన్న ఆమె ముఖ్యమంత్రి నుంచి స్పష్టమైన హామీ తర్వాతనే తిరిగి రాజకీయ స్రవంతిలోకి వచ్చారని కూడా పార్టీలో వినిపిస్తోంది. అంతే కాకుండా కేసీఆర్ సైతం కవిత మంత్రివర్గంలో ఎంట్రీకి అవరోధాలు లేకుండా, రాకుండా లైన్ క్లియర్ చేసుకుంటూ వస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో కవితకు పోటీ వస్తారనుకున్న నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజీ రెడ్డి గోవర్ధన్ చాకచక్యంగా ఆర్టీసీ చైర్మన్ కుర్చీలో కూర్చోపెట్టారు.
Kalvakuntla Kavitha : ఎర్రబెల్లి దయాకరరావుకు చెక్..
శాసన మండలిలో చేసిన తొలి ప్రసంగంలోనే కవిత సొంత ప్రభుత్వంపై విమర్శలు చేశారు.అయితే ఆమె విమర్శల లక్ష్యం మాత్రం ప్రభుత్వం లేదా ముఖ్యమంత్రి కాదన్నది అందరికీ తెలిసిందే. అయితే ఆమె వ్యాఖ్యల వెనుక మంత్రి ఎర్రబెల్లి దయాకరరావును టార్గెట్ చేసే వ్యూహం ఉందని అంటున్నారు. జిల్లా లెక్కల్లో బాజిరెడ్డి గోవర్థన్ అడ్డును తప్పించుకున్న విధంగానే క్యాస్ట్ ఈక్వేషన్లో అడ్డవుతారనుకున్న ఎర్రబెల్లి దయాకరరావు మంత్రి పదవికి ఎర్త్ పెట్టే వ్యూహం కూడా అందులో ఉందని టాక్ వినిపిస్తోంది.
Kalvakuntla Kavitha : స్థానిక ప్రజాప్రతినిధులు ఎదుర్కుంటున్న సమస్యలు మంత్రి దయాకర రావు దృష్టికి తెస్తున్నానని, మొదలు పెట్టి సమస్యలు ఏకరవు పెట్టిన కవిత, పరిష్కారంలో ప్రభుత్వ వైఫల్యం కంటే, మంత్రి చేతకానితనం ఎక్కువ ఉందనే విధంగా మాట్లాడారు. కొత్తగా మండలాలు అయితే ఏర్పడ్డాయి కానీ, ఎంపీపీలకు కార్యాలయాలు లేవని, అందుకు మంత్రి కారణమన్నట్లుగా కవిత మాట్లాడారు. అంటే లోపాలను మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ఖాతాలో వేసిన కవిత క్రెడిట్ ను మాత్రం ముఖ్యమంత్రి ఖాతాలో వేశారు. ఇలా ఆమె ఎర్రబెల్లి దయాకరరావు మంత్రి పదవికి కూడా ఎసరు పెట్టారని, అంటున్నారు.