Kalyan Ram : బాబాయిని పిలిస్తే తమ్ముడు రాడు.. కళ్యాణ్ రామ్ సెన్సేషనల్ కామెంట్స్..!
Kalyan Ram : టాలీవుడ్ లో ప్రయోగాత్మక చిత్రాలు చేయడానికి చాలా తక్కువ మంది హీరోలు మాత్రమే ఉన్నారు. అందులో నందమూరి కళ్యాణ్ రామ్ కచ్చితంగా ఉంటారు. కథ నచ్చితే తన ఇమేజ్ కు సెట్ అవుతుందా లేదా అది కమర్షియల్గా హిట్ అవుతుందా లేదా అని చూడకుండా ప్రయోగానికి ముందడుగు వేస్తారు. అందుకే ఆయన కెరియర్లో అతనొక్కడే, పటాస్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో పాటు 118, హరే రామ్, ఓం త్రీడీ లాంటి డిఫరెంట్ […]
ప్రధానాంశాలు:
Kalyan Ram : బాబాయిని పిలిస్తే తమ్ముడు రాడు.. కళ్యాణ్ రామ్ సెన్సేషనల్ కామెంట్స్..!
Kalyan Ram : టాలీవుడ్ లో ప్రయోగాత్మక చిత్రాలు చేయడానికి చాలా తక్కువ మంది హీరోలు మాత్రమే ఉన్నారు. అందులో నందమూరి కళ్యాణ్ రామ్ కచ్చితంగా ఉంటారు. కథ నచ్చితే తన ఇమేజ్ కు సెట్ అవుతుందా లేదా అది కమర్షియల్గా హిట్ అవుతుందా లేదా అని చూడకుండా ప్రయోగానికి ముందడుగు వేస్తారు. అందుకే ఆయన కెరియర్లో అతనొక్కడే, పటాస్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో పాటు 118, హరే రామ్, ఓం త్రీడీ లాంటి డిఫరెంట్ సినిమాలు కూడా ఉన్నాయి. గతేడాది కళ్యాణ్ రామ్ డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో బింబిసార సినిమాతో మంచి సక్సెస్ ను అందుకున్నారు. టైం ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కించిన ఈ సినిమా మంచి విజయం సొంతం చేసుకుంది. ఇక తాజాగా కళ్యాణ్ రామ్ ‘ డెవిల్ ‘ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చారు. ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకెళుతుంది.
డిసెంబర్ 29న విడుదలైన ఈ సినిమా మరికొద్ది రోజుల్లో అత్యధిక వసూళ్లను సాధిస్తుందో లేదో తెలుస్తుంది. ఇక ఈ సినిమాని అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై అభిషేక్ నామా నిర్మించారు. నవీన్ మేడారం దర్శకత్వ వహించారు. ఇక ఈ సినిమా సక్సెస్ అయిన సందర్భంగా సినిమా యూనిట్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలో కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ.. డెవిల్ సినిమాలో ప్రతి ఒక్కరి పాత్ర అద్భుతంగా ఉంటుందని, హీరోయిన్స్ మాళవిక నాయర్, సంయుక్త మీనన్ పాత్రలు కూడా అద్భుతంగా ఉంటాయని అన్నారు. డెవిల్ సినిమా పాత్రకు నన్ను ఎంచుకోవడం చాలా సంతోషంగా ఉంది అన్నారు. డెవిల్ సినిమా కోసం దర్శక నిర్మాతలు చాలా కష్టపడ్డారని అందుకు తగ్గట్టుగానే రిజల్ట్ అద్భుతంగా వచ్చిందని అన్నారు.
ఇక డెవిల్ సినిమాకి ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరగలేదు. ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందని ఉద్దేశంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా పెట్టలేదు అని తెలుస్తుంది. విడుదలైన మొదటి రోజు నుంచి ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తుంది. ఇకపోతే కళ్యాణ్ రామ్ జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. త్రిబుల్ ఆర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఒక్కటి కూడా రాలేదు. దీంతో ఫ్యాన్స్ అంతా దేవర సినిమాపై ఆసక్తి పెట్టుకున్నారు. ఇక కళ్యాణ్ రామ్ దేవర సినిమా గురించి ఇటీవల అప్డేట్ కూడా ఇచ్చారు. సినిమాను భారీ బడ్జెట్ తో అందరికీ నచ్చే విధంగా తీస్తున్నామని, ఎటువంటి విమర్శలు రాకుండా జాగ్రత్త పడుతున్నామని, అందుకోసం చాలా సమయం పడుతుందని ఫ్యాన్స్ వెయిట్ చేయాల్సిందే అని కళ్యాణ్ రామ్ చెప్పుకొచ్చారు.