కేసీఆర్, జగన్ నిర్ణయాలు సేమ్.. కాని కేసీఆర్‌కు విమర్శలు
దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతూ వస్తోంది. దాంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు లాక్ డౌన్ నిర్ణయాన్ని వదిలేసింది. గత ఏడాది దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ను కేంద్రం అమలు చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయంపై సర్వత్ర విమర్శలు వ్యక్తం అయ్యాయి. దాంతో ఈ ఏడాది కేసుల సంఖ్య లక్షలు దాటుతున్నా కూడా మోడీ మాత్రం తనకు పట్టనట్లుగా లాక్ డౌన్ పై ఆసక్తి చూపించలేదు. కాని కొన్ని రాష్ట్రాలు మాత్రం స్వీయ నిర్భందంలోకి వెళ్లి పోయాయి.
ఏపీలో కర్ఫ్యూ..
ఏపీలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న సమయంలో మొదట సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నైట్ కర్ఫ్యూను అమలు చేశాడు. ఆ తర్వాత డే టైమ్ లో కూడా కర్ఫ్యూను అమలు చేస్తున్నట్లుగా ప్రకటించాడు. కర్ఫ్యూ వల్ల రాష్ట్ర వ్యాప్తంగా జనాలు ఎక్కడికి అక్కడ ఆగిపోయారు. అదే పనిని కేసీఆర్ కూడా చేశారు. కాని లాక్ డౌన్ పేరుతో కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. కేసీఆర్ తీసుకున్న నిర్ణయం పట్ల విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. దేశ వ్యాప్తంగా ఉన్న కేసుల సంఖ్య తెలుగు రాష్ట్రాల సంఖ్యతో పోల్చితే తక్కువగానే ఉంది. అయినా కూడా రెండు రాష్ట్రాలు కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.
కేసీఆర్ పై విమర్శలు…
కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న లాక్ డౌన్ నిర్ణయాన్ని కొందరు తప్పుబడుతున్నారు. కొన్ని సడలింపులు ఇచ్చి లాక్ డౌన్ ను విధించారు. అంటే ఏపీలో కర్ఫ్యూ మాదిరిగానే తెలంగాణలో సీఎం కేసీఆర్ లాక్ డౌన్ పేరుతో కర్ఫ్యూను అమలు చేయడం జరిగింది. ఇదే ఇప్పుడు కేసీఆర్ కు తిప్పలు తెప్పించింది. అంటే జనాలు లాక్ డౌన్ అంటేనే ఆందోళన చెందేలా గత ఏడాది పరిస్థితులు తారస పడ్డాయి. కనుక తెలంగాణలో లాక్ డౌన్ అనగానే అంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాని వైఎస్ జగన్ కర్ఫ్యూ పేరుతో నియంత్రణ చేస్తున్నాడు కనుక జనాలు కేసీఆర్ తీరును విమర్శించి జగన్ ను ప్రశంసిస్తున్నారట.