KCR : నిరుద్యోగులకు కెసిఆర్ గుడ్ న్యూస్.. 91147 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
KCR : తెలంగాణ సీఎం కేసీఆర్ నిన్న వనపర్తి సభలో చేసిన ప్రకటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. రేపు ఉదయం 10 గంటలకు ప్రతి ఒక్కరూ టీవీ ముందు కూర్చోండి అంటూ కేసీఆర్ చాలా నమ్మకంగా ప్రకటించాడు. ఆ సమయంలో ఉద్యోగాల ప్రకటన గురించి అసెంబ్లీ లో కీలక ప్రకటన చేస్తానని సీఎం కేసీఆర్ ప్రకటించారు. నిరుద్యోగ సోదరులకు తాను చేయబోయే ప్రకటన సంతోషాన్ని కలిగిస్తుంది అన్నట్లుగా సీఎం చేసిన ప్రకటన అందరికీ ఆసక్తిని రేకెత్తించింది.కేసీఆర్ ప్రకటన తో ప్రతి ఒక్క నిరుద్యోగి చదువు బాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు.
ఇక అసెంబ్లీలో కేసీఆర్ ప్రకటన ఏంటి.. ఎన్ని ఉద్యోగాలు ఉంటాయి అనే విషయమై చర్చ జరుగుతోంది. ఉన్నతాధికారుల నుండి అందుతున్న సమాచారం ప్రకారం దాదాపు లక్ష ఉద్యోగాలకు సంబంధించిన ప్రకటన కేసీఆర్ ప్రభుత్వం విడుదల చేసే సమాచారం అందుతోంది. రెండు దఫాలుగా కేసీఆర్ ప్రభుత్వం ఈ నోటిఫికేషన్ లను వేసే అవకాశాలు ఉన్నాయి.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల గడువు దగ్గర పడుతోంది. ఈ సమయం ప్రభుత్వం ఉద్యోగులను మరియు నిరుద్యోగులను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
అందులో భాగంగానే నేటినుంచే 91,147 వేల ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేశారు. లక్షలాది నిరుద్యోగులు ఈ ప్రకటన కోసం ఎదురు ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో కేసీఆర్ అసెంబ్లీ ప్రకటన ఉత్కంఠ కలిగించింది. లక్ష ఉద్యోగాలు భర్తీ అనేది ప్రభుత్వం ముందు ఉన్న లక్ష్యం.అంటూ కేసీఆర్ ప్రకటిస్తారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ని కూడా ప్రకటించడం ద్వారా వారికి సంతోషాన్ని కలిగించే అవకాశాలు ఉన్నాయి.