YS Sharmila Party : తెలంగాణలో షర్మిల పార్టీ వెనుక ఉన్నది సీఎం కేసీఆరే? ఆయన వ్యూహం తెలిస్తే నోరెళ్లబెడతారు?
YS Sharmila Party : తెలంగాణలో సీఎం కేసీఆర్ పై అప్పుడే వ్యతిరేకత మొదలైంది. కేసీఆర్ ముఖ్యమంత్రి ఆరేళ్లు కూడా పూర్తి కాలేదు.. అప్పుడే కేసీఆర్ పై జనాలకు బొత్తికొట్టేసింది. టీఆర్ఎస్ పార్టీపైనా నెగెటివ్ ప్రచారాలు ఊపందుకోవడం.. పార్టీలోనూ అసంతృప్తి జ్వాలలు రగలడం మనం చూస్తూనే ఉన్నాం. కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేస్తారంటూ ఊహాగానాలు రావడం.. ఆ తర్వాత చాలామంది కేటీఆర్ ముఖ్యమంత్రి విషయంపై వ్యతిరేకత చూపడం, మరో 10 ఏళ్ల వరకు నేను ముఖ్యమంత్రిగా ఉంటా.. అంటూ కేసీఆర్ ప్రకటించడం… ఇంతలోనే వైఎస్సార్ కూతురు వైఎస్ షర్మిల పార్టీ పెడుతా.. అంటూ ప్రకటించడం.. అంతా ఏదో మాయలా ఉంది కదా.
ఈ మాయ వెనుక ఉన్నది ఎవరో కాదట. సాక్షాత్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దీని వెనుక ఉన్నారట. అవును.. అసలు తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టడం వెనుక ఉన్న కర్త కర్మ క్రియ అన్నీ సీఎం కేసీఆరేనట. లేకపోతే.. ఆమెకు తెలంగాణలో పార్టీ పెట్టాల్సిన అవసరం ఏంటి? ఆమెకు నిజంగా పార్టీ పెట్టాలని ఉంటే.. ఏపీలో పెట్టేవారు కానీ.. తెలంగాణలో పెట్టడం వెనుక ఉన్న అసలు రహస్యం.. కేసీఆర్ కదుపుతున్న పావుల్లో ఒకటి.
YS Sharmila Party : తెలంగాణలో బీజేపీ ఓటు బ్యాంక్ ను దెబ్బతీసే వ్యూహమే.. షర్మిల పార్టీ
తెలంగాణలో ప్రస్తుతం బీజేపీ బలపడుతోంది. దూసుకుపోతోంది. వేరే ఏ పార్టీ తెలంగాణలో బలపడినా సమస్య లేదు కానీ.. బీజేపీ బలపడకూడదు. బీజేపీ బలపడటమే పెద్ద సమస్యగా మారింది కేసీఆర్ కు. తెలంగాణలో బీజేపీని తొక్కాలంటే ఉన్న ఏకైక పరిష్కారం వైఎస్సార్ కూతురు షర్మిల. వైఎస్సార్ కు తెలంగాణలో బాగానే ప్రజాభిమానం ఉంది. దాన్ని టీఆర్ఎస్ కు అనుకూలంగా, బీజేపీకి ప్రతికూలంగా మార్చాలి. అక్కడి నుంచి పుట్టిన ఆలోచనే షర్మిల పార్టీ.
షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టగానే.. ముందుగా బీజేపీ నుంచి వలసలు ప్రారంభం అవుతాయి. ప్రారంభం అయ్యేలా చేస్తారు. వలలు వేస్తారు. వచ్చే సంవత్సరం జమిలీ ఎన్నికలు జరిగితే.. టీఆర్ఎస్ పార్టీని రెండుగా చేసి.. చీలిన పార్టీని బీజేపీతో జతకట్టేలా చేసి.. టీఆర్ఎస్ పార్టీని ఓడించడమే లక్ష్యంగా బీజేపీ పెట్టుకుంది.. అనే విషయం కేసీఆర్ కు తెలిసింది.
అందుకే వాళ్ల కన్నా ముందే ఒక అడుగు వేసిన షర్మిలను రంగంలోకి దించారు. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీలో కొందరు నేతలు అసంతృప్తితో ఉన్నారు. అలాగే.. కాంగ్రెస్ లో ఉన్న సీనియర్లలో కొందరు షర్మిల పార్టీ వైపు మొగ్గు చూపుతారు. వాళ్లు బీజేపీలోకి వెళ్లకుండా.. షర్మిల పార్టీలోకి వెళ్తే.. బీజేపీ బలహీనపడినట్టే. అలాగే.. బీజేపీ నుంచి కూడా కొందరు ముఖ్యమైన నేతలను షర్మిల పార్టీ వైపు లాగితే ఖేల్ ఖతం.