Telangana Dalit Bandhu : హుజూరాబాద్ లోనే దళిత బంధును ప్రారంభించడం వెనుక అసలు కారణం ఇదేనట..?

Advertisement
Advertisement

Telangana Dalit Bandhu హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో విజేతగా నిలబడే పార్టీనే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నిక అత్యంత కీలకం కావడంతో సీఎం కేసీఆర్ సూపర్ స్కెచ్ వేశారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అమలు చేయబోతున్న దళిత సాధికారత పథకానికి.. “తెలంగాణ దళిత బంధు” అనే పేరును ఖరారు చేసిన కేసీఆర్.. ఆ పథకాన్ని మొదటగా పైలట్ ప్రాజెక్టు కింద హుజురాబాద్ Telangana Dalit Bandhu నియోజకవర్గంలో అమలు చేయాలని నిర్ణయించారు.

Advertisement

ప్రాంరంభోత్సవ తేదీని త్వరలో ప్రకటించనున్నారు. కేసీఆరే హుజురాబాద్ లో ఈ పథకాన్ని ప్రారంభించబోతున్నారు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దళిత బంధు పథకాన్ని హుజురాబాద్ నుంచి ప్రారంభించాలని కేసీఆర్ నిర్ణయించడంపై విపక్షాలు విమర్శలు చేస్తున్నారు. హుజారాబాద్ లో గెలవడం కష్టమని తేలడంతో కొత్త ఎత్తులు వేస్తున్నారని చెబుతున్నారు.

Advertisement

kcr-telangana-dalit-bandhu

దళిత ఓట్లే.. Telangana Dalit Bandhu

హుజురాబాద్  Telangana Dalit Bandhu లో కొన్ని కుటుంబాలకు సాయం చేసి ఓట్లు దండుకుంటారని, తర్వాత ఆ స్కీం ఆపివేస్తారని విపక్ష నేతలు అంటున్నారు. గతంలో దళితులకు మూడు ఎకరాల భూపంపిణి విషయంలోనూ ఇదే జరిగిందని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. దళితులకు కొత్త పథకం ప్రకటించినప్పుడే తాము హుజురాబాద్ Telangana Dalit Bandhu కోసమే ప్రకటించారని చెప్పామని, ఇదే ఇప్పుడు నిజమైందని అంటున్నారు. మరోవైపు టీఆర్ఎస్ నేతలు మాత్రం విపక్షాల ఆరోపణలను ఖండిస్తున్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ గతంలో అనేక కార్యక్రమాలను ఉమ్మడి కరీంనగర్ జిల్లానుంచే ప్రారంభించారని చెబుతున్నారు.

తెలంగాణ ఉద్యమానికి నాందిగా నిర్వహించిన సింహగర్జన సభ మొదలుకొని, తాను ఎంతగానో అభిమానించిన రైతు బీమా పథకం దాకా కరీంనగర్ జిల్లా నుంచే ప్రారంభించారని అంటున్నారు. ప్రతిష్టాత్మకమైన రైతుబంధు పథకం హుజూరాబాద్ Telangana Dalit Bandhu కేంద్రంగానే మొదలైందని…అదే ఆనవాయితీని సిఎం కొనసాగిస్తూ ‘తెలంగాణ దళిత బంధు’ పథకాన్ని కూడా హుజూరాబాద్ నుంచే ప్రారంభించాలని నిర్ణయించారని స్పష్టం చేస్తున్నారు గులాబీ నేతలు.

Telangana govt

హుజూరాబాదే కేంద్రంగా.. Telangana Dalit Bandhu

ఏదేమైనా.. తెలంగాణ రాజకీయాలన్ని ప్రస్తుతం హుజారాబాద్ కేంద్రంగానే సాగుతున్నాయి. టీఆర్ఎస్ కు రాజీనామా చేసిన ఈటల రాజేందర్ ను తన సొంత నియోజకవర్గంలో గెలిచి కేసీఆర్ కు షాకివ్వాలని భావిస్తున్నారు. ఈటలను ఓడించేందుకు గులాబీ బాస్ వ్యూహాలు రచిస్తున్నారు. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి నియామకంలో కాంగ్రెస్ కూడా రేసులోకి వచ్చింది.

మూడు ప్రధాన పార్టీల ఫోకస్ అంతా ఇక్కడే ఉండటంతో హుజురాబాద్ Telangana Dalit Bandhu రాజకీయ సమీకరణలు రోజురోజుకు మారిపోతున్నాయి. తెలంగాణ రాజకీయాల్లో హుజూరాబాద్ Telangana Dalit Bandhu వేడి మామూలుగా లేదు.. హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో విజేతగా నిలబడే పార్టీనే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అదే ఏజెండాగా పార్టీలు పావులు కదుపుతున్నాయి.

Advertisement

Recent Posts

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

22 mins ago

Samantha : స‌మంత ప‌దో త‌ర‌గ‌తి మార్కుల షీట్ చూశారా.. ఏయే స‌బ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వ‌చ్చాయంటే..!

Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…

1 hour ago

CISF Fireman Recruitment : 1130 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

CISF Fireman Recruitment :  సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్‌మెన్‌ల నియామక…

2 hours ago

Farmers : రైతుల‌కు శుభ‌వార్త.. అకౌంట్‌లోకి డ‌బ్బులు.. ఏపీ ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు..!

Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఆ రాష్ట్ర‌ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ…

3 hours ago

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏతో పాటు జీతం పెంపు

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…

4 hours ago

Balineni Srinivas Reddy : వైసీపీకి రాజీనామా చేశాక బాలినేని చేసిన కామెంట్స్ ఇవే..!

Balineni Srinivas Reddy : గ‌త కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడ‌నున్న‌ట్టు అనేక ప్ర‌చారాలు జ‌రిగాయి. ఎట్ట‌కేల‌కి అది…

5 hours ago

Jamili Elections : జ‌మిలి ఎన్నిక‌లు సాధ్య‌మా.. తెలుగు పార్టీలు ఏం చెబుతున్నాయి..!

Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్‌ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం…

6 hours ago

Naga Manikanta : మ‌ణికంఠ చెప్పిన మాట‌ల‌కి, చేసే ప‌నుల‌కి సంబంధ‌మే లేదుగా.. తెగ ట్రోలింగ్..!

Naga Manikanta : బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని ఎంతగానో అల‌రిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజ‌న్ 8 జ‌రుపుకుంటుంది.తాజా సీజ‌న్‌లోని…

7 hours ago

This website uses cookies.