Tomatoes : టమాటాలు.. లేకుంటే ఏ కూర వండలేం. ఏ కూర వండినా.. అందులో టమాట ఉండాల్సిందే. టమాట కూర, టమాట పచ్చడి, టమాట చారు.. ఇలా టమాటతో ఎన్నో రకాల వంటలను చేసుకుంటాం. అసలు.. టమాట లేకపోతే రోజే గడవదు. అది టమాటకు మనం ఇచ్చే విలువ. అయితే.. టమాట టేస్ట్ గా ఉంటుందని మనం అన్ని కూరల్లో వాడుతుంటాం. కానీ.. మనకు తెలియకుండానే.. టమాటను ప్రతి వంటల్లో తిని ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతున్నాం.
టమాటాల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. టమాటాల్లో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. టమాటాలను నిత్యం తీసుకుంటే.. ఎన్నో రకాల దీర్ఘకాలిక సమస్యలకు చెక్ పెట్టొచ్చు. అయితే.. చాలామంది టమాటాలను తింటే క్యాన్సర్ రాదని నిక్కచ్చిగా చెబుతుంటారు. మరి.. నిజంగా టమాటాలను తింటే క్యాన్సర్ రాదా? టమాటాల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.
టమాటాల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. టమాటాల్లో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. విటమిన్ ఏ, సీ, కే పుష్కలంగా ఉంటాయి. అలాగే.. టమాటాల్లో పొటాషియం ఉంటుంది. అయితే.. టమాటాల్లో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. సోడియం కంటెంట్ కూడా తక్కువగా ఉంటుంది. పొటాషియంతో పాటు.. మెగ్నీషియం, కాల్షియం, పాస్ఫరస్, కాపర్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
గుండె సమస్యలు ఉన్నవాళ్లు, హైబీపీ ఉన్నవాళ్లు, కొలెస్టరాల్ ఉన్నవాళ్లు.. టమాటాలను ఖచ్చితంగా తినాల్సిందే. టమాటాలలో ఉండే.. కాల్షియం ఎముకలను దృఢంగా చేస్తుంది. కంటి ఆరోగ్యం మెరుగు పడాలన్నా.. రక్తంలో షుగర్ లేవల్స్ ను కంట్రోల్ లో ఉంచాలన్నా టమాటాలను తినాల్సిందే.
టమాటాలను నిత్యం తీసుకోవడం వల్ల.. అది శరీరంలో ఏర్పడే క్యాన్సర్ సెల్స్ ను నాశనం చేస్తుంది. చాలామందికి గ్యాస్ట్రిక్ క్యాన్సర్ వస్తుంది. దాన్ని తగ్గించుకోవాలంటే.. టమాటాలను తినాల్సిందే. టమాటాలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాలతో పోరాడుతాయి. క్యాన్సర్ కు కారణమయ్యే ప్రీ రాడికల్స్ తో పోరాడి.. వాటిని నాశనం చేస్తాయి. దీంతో క్యాన్సర్ సమస్యకు చెక్ పెట్టొచ్చు. టమాటాల వల్ల ఆరోగ్యం మాత్రమే కాదు.. అందం కూడా పెరుగుతుంది. జుట్టు పెరగాలన్నా.. దృఢంగా మారాలన్నా.. టమాటాలను తినాల్సిందే. ముఖంలో గ్లో కావాలన్నా.. చర్మం నిగారింపు రావాలన్నా.. టమాటాలను తినాల్సిందేనని నిపుణులు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి ==> రోజురోజుకూ పెరుగుతున్న షుగర్ వ్యాధి.. అసలు షుగర్ వచ్చిందని ఎలా తెలుసుకోవాలి?
ఇది కూడా చదవండి ==> హై బీపి ఉన్నవారు ఉప్పుకు బదులు ఇవి వాడండి.. ?
ఇది కూడా చదవండి ==> బీపీ చెక్ చేసుకునే ముందు ఈ పనులు మాత్రం అస్సలు చేయకండి..!
ఇది కూడా చదవండి ==> పెరుగు అంటే అస్సలు పడదా..? అయితే ఈ ఆరోగ్య ప్రయోజనాలను కోల్పోయినట్టే..!
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…
India : కొన్నేళ్లుగా భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా,…
Bank Account : ఒకప్పుడు ఒక వ్యక్తికి ఒక బ్యాంక్ ఖాతా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కో వ్యక్తికి…
Periods : ప్రస్తుతం మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణం చేత యువతను ఎన్నో రకాల…
Bobby : రచయితగా కెరియర్ స్టార్ట్ చేసిన బాబి తర్వాత ఆ అసిస్టెంట్ డైరెక్టర్గా మారాడు. పవర్ సినిమాకి బాబీ…
Sleep : మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారం అనేది ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం…
This website uses cookies.