TRS : ఆ మాట ఎత్తినవాళ్లందరికీ.. ఇదే గతి?.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

TRS : ఆ మాట ఎత్తినవాళ్లందరికీ.. ఇదే గతి?..

 Authored By kondalrao | The Telugu News | Updated on :17 June 2021,7:00 am

TRS : బయటివాళ్లతో ఏ గొడవలూ లేనప్పుడు ఇంట్లో వాళ్లతోనే గొడవలు పెట్టుకుంటారనే కామెడీ డైలాగ్ వినే ఉంటారు. ఎక్కువ శాతం దీన్ని జోక్ గా చెప్పుకుంటారేమో గానీ తెలంగాణలో ఇదే ఇప్పుడు సీరియస్ వ్యవహారంగా మారిపోయింది. 2014కి ముందు కేసీఆర్ ఆంధ్రావాళ్లను టార్గెట్ చేశారు. ఇప్పుడు తెలంగాణవాళ్లను లక్ష్యంగా పెట్టుకుంటున్నారు. మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్)లో తొలి నుంచి తనతో కలిసి పనిచేసినవాళ్లనే దూరం చేసుకుంటున్నారు. ఆలె నరేంద్ర, విజయశాంతి, నాయిని నరసింహా రెడ్డి, ఈటల రాజేందర్.. ఇలా చాలా మందిని పార్టీ నుంచి సాగనంపారు. ఈ లిస్టులో ప్రస్తుతం నల్గొండకు చెందిన టీఆర్ఎస్ సీనియర్ నేత, రాష్ట్ర మంత్రి ఒకరు ఉన్నట్లు తెలుస్తోంది.

సేమ్ ప్రాబ్లం..

టీఆర్ఎస్ లో మొదటి నుంచి కేసీఆర్ తో కలిసి ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేసినవాళ్లు గులాబీ జెండాకి తాము కూడా ఓనర్లమే అనే ఫీలింగుతో ఉన్నారు. ఆ భావన మనసులో ఉన్నంత వరకు ఓకే గానీ మాటల రూపంలో బయటికి వస్తే మాత్రం అవి ముఖ్యమంత్రి కేసీఆర్ చెవిన పడుతున్నాయి. దీంతో సీఎం కేసీఆర్ సీరియస్ అయిపోతున్నారు. పార్టీలో క్రమశిక్షణ కోసం అలా చేస్తే పర్లేదు గానీ కేసీఆర్ తన కుమారుడు కేటీఆర్ పట్టాభిషేకం కోసం సీనియర్లను ఒకరి తర్వాత ఒకరిని వెళ్లగొడుతున్నారనే అపవాదును మూటగట్టుకుంటున్నారు. అందులో నిజమెంతుందో తెలియదు గానీ ప్రజలు మాత్రం ఇదే అనుకుంటున్నారు.

kcr throwing out senior leaders from trs

kcr throwing out senior leaders from trs

అదే జిల్లాకు చెందిన.. : TRS

నల్గొండ జిల్లాకు చెందిన ఆ సీనియర్ లీడర్, రాష్ట్ర మంత్రి.. సీఎం కేసీఆర్ గురించి, టీఆర్ఎస్ పార్టీ గురించి ఎక్కడో ఏదో సందర్భంలో చేసిన వ్యాఖ్యలు హైకమాండ్ కి తెలియటంతో అతణ్ని దూరం పెట్టడం స్టార్ట్ చేశారని సమాచారం. ఆ సీనియర్ నాయకుడి స్థానాన్ని అదే జిల్లాకు చెందిన మరో సీనియర్ నేత చేత భర్తీ చేయాలని ముఖ్యమంత్రి ఆల్రెడీ ప్లాన్ వేశారని పేర్కొంటున్నారు. కేసీఆర్ తొలిసారి సీఎం అయినప్పుడు ఇంత కఠినంగా లేరని టీఆర్ఎస్ కేడర్ గుర్తు చేస్తోంది. ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్ లోకి వచ్చినవాళ్లయితే ‘‘గులాబీ జెండాకి మేమూ ఓనర్లమే’’ అనే తల బిరుసు మాటలు మాట్లాడరని, కుక్కిన పేను లెక్క ఉంటారని కేసీఆర్ అనుకుంటున్నారు. అందుకే వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని టాక్. దీనికితోడు కాంగ్రెస్, టీడీపీలను తొక్కేయటం కోసం కూడా ఆయా పార్టీల నాయకులకు సీఎం కేసీఆర్ మంత్రి పదవులు ఇచ్చి ఎంకరేజ్ చేస్తున్నారని అంటున్నారు.

ఇది కూడా చ‌ద‌వండి==> Viral Video : పెళ్లి కూతురు గౌనులో దూరి.. ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు..?

ఇది కూడా చ‌ద‌వండి==> Lungs : ఊపిరితిత్తుల సమస్యకు చెక్ పెట్టాలా? ఈ పని చేయండి.. శ్వాస సమస్యలు కూడా దూరమవుతాయి?

ఇది కూడా చ‌ద‌వండి==> నవగ్రహాలకు ఈ శ్లోకాలతో ప్రదక్షణలు చేస్తే !

ఇది కూడా చ‌ద‌వండి==> Ram gopal varma : వర్మ ఏంటీ ఆ ప‌ని.. జిమ్‌లో అరియానాతో రాం గోపాల్ వర్మ ర‌చ్చ మాములుగా లేదుగా..!

kondalrao

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది