Lungs : ఊపిరితిత్తుల సమస్యకు చెక్ పెట్టాలా? ఈ పని చేయండి.. శ్వాస సమస్యలు కూడా దూరమవుతాయి?
Lungs : మనిషి జీవితంలో వ్యాయామం చాలా ముఖ్యం. వ్యాయామం చేయకపోతే ఎన్నో సమస్యలు వస్తాయి. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే ఎన్నో రోగాలకు చెక్ పెట్టొచ్చు. అలాగే మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. అయితే.. ఈ మధ్య మహమ్మారి వల్ల చాలామందికి ఊపిరితిత్తుల సమస్యలు వస్తున్నాయి. ఊపిరితిత్తుల సమస్యలు వస్తే శ్వాసకు సంబంధించిన సమస్యలు వస్తాయి. అందుకే.. ఊపిరితిత్తులను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ వచ్చినా కష్టమే. ఊపిరితిత్తుల సమస్యలకు చెక్ పెట్టాలంటే.. దాని […]
Lungs : మనిషి జీవితంలో వ్యాయామం చాలా ముఖ్యం. వ్యాయామం చేయకపోతే ఎన్నో సమస్యలు వస్తాయి. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే ఎన్నో రోగాలకు చెక్ పెట్టొచ్చు. అలాగే మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. అయితే.. ఈ మధ్య మహమ్మారి వల్ల చాలామందికి ఊపిరితిత్తుల సమస్యలు వస్తున్నాయి. ఊపిరితిత్తుల సమస్యలు వస్తే శ్వాసకు సంబంధించిన సమస్యలు వస్తాయి. అందుకే.. ఊపిరితిత్తులను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ వచ్చినా కష్టమే.
ఊపిరితిత్తుల సమస్యలకు చెక్ పెట్టాలంటే.. దాని కోసం మనం చేయాల్సింది ఒక్కటే. శ్వాసకు సంబంధించిన వ్యాయామం. శ్వాసకు సంబంధించిన వ్యాయామం చేయడం వల్ల.. మ్యూకస్ అనే ఫ్లూయిడ్స్ తగ్గుతాయిన. దాని వల్ల.. శ్వాస సమస్యలకు తగ్గుతాయి. శ్వాస వ్యాయామం చేయడం వల్ల.. పూర్తి స్థాయిలో ఆక్సిజన్ ఊపిరితిత్తుల్లోకి చేరుతుంది. దాని వల్ల.. శ్వాస సమస్యలు తగ్గిపోయి.. ఊపిరితిత్తులు శుభ్రంగా మారుతాయి.
Lungs : శ్వాస వ్యాయామం ఎలా చేయాలంటే?
ఊపిరితిత్తుల ఆరోగ్యం కోసం రోజులో కనీసం 10 నిమిషాలు కేటాయించినా చాలు. ఉదయం లేవగానే.. ప్రశాంతంగా కాసేపు కూర్చొని ఆ తర్వాత మీ నోరును మూసేసి.. ముక్కు ద్వారా నెమ్మదిగా శ్వాసను పీల్చుకోండి. నెమ్మదిగా శ్వాసను తీసుకోవడం వల్ల.. పూర్తిస్థాయిలో ఆక్సిజన్ ఊపిరితిత్తుల్లోకి చేరుతుంది. అలాగే.. హమ్మింగ్ చేస్తూ ఉండాలి. అంటే.. శ్వాసను నెమ్మదిగా తీసుకోవడం.. నెమ్మదిగా వదలడం.. ఇలాగే ఒక 5 నుంచి 10 నిమిషాలు చేయాలి. ఒకసారి.. ముక్కు ఒక రంధ్రాన్ని మూసి.. మరో రంధ్రం ద్వారా శ్వాసను పీల్చుకోండి. మరోసారి.. ఇంకో రంధ్రాన్ని మూసి.. మరో రంధ్రంతో శ్వాసను పీల్చుకోండి. ఇలా క్రమం తప్పకుండా చేస్తూ ఉంటే.. ఊపిరితిత్తుల్లోకి స్వచ్ఛమైన గాలి వెళ్తుంది. దాని వల్ల.. శ్వాస సంబంధ సమస్యలు తగ్గుతాయి. అలాగే.. ఊపిరితిత్తుల్లో ఉండే ఇన్ఫెక్షన్ కూడా తగ్గుతుంది.