TSPSC Paper Leak Case : పేపర్ లీక్ కి ముందర.. కర్మాన్ ఘాట్ లోని ఓ హోటల్‌లో రేణుక, డాక్యా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

TSPSC Paper Leak Case : పేపర్ లీక్ కి ముందర.. కర్మాన్ ఘాట్ లోని ఓ హోటల్‌లో రేణుక, డాక్యా..!

 Authored By kranthi | The Telugu News | Updated on :25 March 2023,7:20 pm

TSPSC Paper Leak Case : టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ముందు ఒకటే పేపర్ అనుకున్నారు. అది కాస్త గ్రూప్ వన్ పేపర్ వరకూ వెళ్లిపోయింది. కేవలం ఒక టీచర్ చేసిన పని వల్ల ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది. డబ్బు కోసం టీచర్ గా ఉన్న రేణుక, ఆమె భర్త టెక్నికల్ అసిస్టెంట్.. ఇద్దరూ కలిసి తప్పుడు పనులు చేసి అడ్డంగా దొరికిపోయారు. రేణుక, తన భర్త ఢాక్యా ఇద్దరూ పరీక్షకు రెండు రోజుల ముందు హైదరాబాద్ లోని కర్మన్ ఘాట్ లో ఓ హోటల్ లో రెండు రూమ్స్ రెంట్ కు తీసుకున్నారు.

key points reported in the remand report of tspsc leak case

key points reported in the remand report of tspsc leak case

ఆ రూమ్స్ లోనే నీలేష్, గోపాల్ ఇద్దరినీ పరీక్షకు ప్రిపేర్ చేయించారు. మార్చి 5న పరీక్ష జరిగింది. వాళ్లు సరూర్ నగర్ లో పరీక్ష రాశారు. ఈ పేపర్ లీకేజీలో హోటల్ యజమాని, రిసెప్షనిస్టులను పోలీసులు సాక్షులుగా చేర్చారు. ఇప్పటి వరకు మొత్తం 19 మందిని పోలీసులు సాక్షులుగా చేర్చారు. ఏఈ ప్రశ్నాపత్రంతో పాటు గ్రూప్ వన్ పేపర్ లీకేజీతోనూ సంబంధాలు ఉన్నట్టు సిట్ అధికారులు అనుమానిస్తున్నారు. ఇంకా ఎన్ని ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయి అనే దానిపై విచారించేందుకు మరో 5 రోజుల పాటు రేణుక, ఢాక్యా, ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డిని పోలీస్ కస్టడీకి అనుమతించాలని సిట్ అధికారులు కోర్టుకు విన్నవించారు.

TSPSC Paper Leak: ఏఈ పేపర్ లీక్ విషయం ఎలా బయటకొచ్చిదంటే..! | How did the  TSPSC AE paper leak issue come out - Telugu Oneindia

TSPSC Paper Leak Case : పెను దుమారం లేపుతున్న గ్రూప్ వన్ ప్రశ్నాపత్రం లీకేజీ

ఏఈ పేపర్ తో పాటు గ్రూప్ వన్ ప్రశ్నాపత్రం కూడా లీక్ అయిందనే విషయాలు తెలుస్తుండటంతో రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగుల నుంచి ఒక్కసారిగా ఆగ్రహజ్వాలలు పెల్లుబెక్కుతున్నాయి. టీఎస్పీఎస్సీలోనే ఉద్యోగాలు చేస్తూ గ్రూప్ వన్ మెయిన్స్ కు అర్హత సాధించిన ఎనిమిది మందిని సిట్ విచారించింది. వారిలో ఇద్దరికి పేపర్ లీకేజీతో సంబంధం ఉన్నట్టు తేలింది. లీకేజీ అంశంలో ఎన్ఆర్ఐలు కూడా ఇన్వాల్వ్ అయినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. రేణుక దగ్గర్నుంచి.. ఈ కేసు పలు మలుపులు తిరుగుతోంది. చూడాలి మరి.. ఇంకా ఈకేసులో ఎన్ని ట్విస్టులు ఉంటాయో.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది