kodali nani : కొడాలి నానికి జనసేన చుక్కలు చూపిస్తుందా..?
kodali nani కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీకి కంచుకోటల్లాంటి నియోజకవర్గాల్లో గుడివాడ ఒకటి. ఆ కంచుకోటను ఇప్పుడు వైసీపీ మంత్రి కొడాలి నాని kodali nani తన అడ్డాగా మార్చుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ సిఫార్సుతో 2004లో తొలిసారి టిక్కెట్ దక్కించుకున్న నాని 2004, 2009లో టీడీపీ నుంచి వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి మరో రెండు సార్లు విజయం సాధించారు. అయితే నానికి ప్రతిసారి ఏదో ఒక ఈక్వేషన్ కలిసి రావడంతో గుడివాడలో ఆయన గెలుపు సులువు అవుతోంది. గత ఎన్నికల్లో చంద్రబాబు విజయవాడలో యువనేతగా ఉన్న దేవినేని అవినాష్‌ను పోటీ చేయించారు. దేవినేని పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. అయితే ఇదే స్థానం నుంచి బరిలోకి దిగిన జనసేన .. చివరి నిమిషంలో తన అభ్యర్థిని ఉపసంహరించుకుంది. దీంతో నియోజకవర్గంలో బలంగా ఉన్న కాపుల ఓటింగ్ అంతా నానికే పడింది. దీంతో నాని గెలుపు సులువైందని విశ్లేషకులు అంటున్నారు. వరుస గెలుపులు సైతం .. ఆయనకు ప్లస్ గా మారిందని టాక్ నడుస్తోంది.
జనసేన పోటీలో ఉండి ఉంటే….kodali nani
కాపుల ఓట్లు చీల్చితే నాని kodali nani గెలిచేందుకు ఆపసోపాలు అయితే పడాల్సి వచ్చేది. ఇక నాని మంత్రి అయ్యాక కూడా జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ను దారుణమైన పదజాలంతో టార్గెట్ చేస్తూ వస్తున్నారు. చంద్రబాబు, పవన్‌కు లింకులు పెట్టి మరీ విమర్శలు చేస్తున్నారు. ఆ తర్వాత గుడివాడలో పర్యటించిన పవన్ నానిపైనా విమర్శలు సంధించారు. అయితే వచ్చే ఎన్నికల్లో పవన్ నానిని గట్టిగా టార్గెట్ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. జిల్లాలో మిగిలిన చోట్ల ఎలా ఉన్నా గుడివాడలో ఎక్కవ ఓటింగ్ ఉన్న కాపులు ముందు నుంచి నానికి అండగా ఉంటూ వస్తున్నారు. అయితే గత ఎన్నికల్లో జనసేన అభ్యర్థి పోటీలో ఉండి ఉంటే ఖచ్చితంగా నాని మెజార్టీ తగ్గి ఉండేది. ఇదే పాయింట్ మీద పవన్ ఈసారి మాత్రం గుడివాడలో బలమైన అభ్యర్థిని దింపాలని ఫిక్స్ అయ్యారు. నానిని ఎలాగైనా ఓడించాలని జనసేన పట్టుపట్టిందని విశ్లేషకులు అంటున్నారు. అందులో భాగంగా పవన్ కృష్ణా జిల్లాపై దృష్టి పెట్టారని కూడా టాక్ వినిపిస్తోంది.
టీడీపీ సైతం .. kodali nani
అటు టీడీపీ నేతలు కూడా నాని విషయంలో అంతే కసితో ఉన్నారు. ఈ నేపథ్యంలో పవన్ తో గనుక దోస్తీ కుదిరితే, ఈ సీటును ఆయనకే వదిలేయాలని టీడీపీ యోచిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక పవన్ సైతం … నానిని ఓడించేందుకు జనసేన నుంచి కమ్మ వర్గానికి చెందిన వారికే టిక్కెట్ ఇవ్వాలని డిసైడయ్యారని తెలుస్తోంది. దీంతో వచ్చే కమ్మల ఓట్లు కొంత వరకు చీల్చడంతోపాటు తన అభిమానుల ఓట్లను కలిపి, నానిని ఓడించాలన్నది పవన్ వ్యూహంగా జనసేన వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ ఇరు పార్టీలు కలిస్తే, నాని గెలుపుకు తీవ్రంగా కష్టపడాల్సి వస్తుందని అంచనా వినిపిస్తోంది. అయితే వచ్చే ఎన్నికల్లో నాని గెలుపు నల్లేరు మీద నడక కాదని నేతలు చర్చించుకుంటున్నారు. మరి ఈ దఫా కొడాలికి .. ఏ ఈక్వేషన్ కలిసివస్తుందో వేచి చూడాల్సిందే.
ఇది కూడా చదవండి ==> కేబినెట్ బెర్తుల కోసం భారీ క్యూ.. ఊహించని నేతలకు దక్కనున్న మంత్రి పదవి?
ఇది కూడా చదవండి ==> వంగవీటి ఇప్పటికైనా కుదురుకునేనా..?
ఇది కూడా చదవండి ==> అమరావతి రాజధాని భూముల కుంభకోణం.. అసలు కథ నడిపిన పెద్ద తలకాయ ఆయనేనా?
ఇది కూడా చదవండి ==> ఎంపీ నుంచి ఎమ్మెల్యేకు మారిన శ్రీ భరత్ రాజకీయం.. ఈసారైనా కలిసివచ్చేనా..!