వంగవీటి ఇప్పటికైనా కుదురుకునేనా..?

0
Advertisement

vangaveeti radha బెజ‌వాడ రాజ‌కీయాల్లో త‌న‌కంటూ ప్ర‌త్యేక స్థానం క‌ల్పించుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్న వంగ‌వీటి రంగా వార‌సుడు రాధా..  vangaveeti radha ఎప్ప‌టిక‌ప్పుడు చ‌తికిల‌ప‌డుతూనే ఉన్నారు. కాంగ్రెస్ టు.. ప్ర‌జారాజ్యం.. అటు నుంచి వైసీపీ త‌ర్వాత టీడీపీ ఇలా ఒక‌చోట కూడా కుదురుగా ఉండ‌లేక ఆయ‌న స‌త‌మ‌తం అవుతున్నారు. ఏ పార్టీలో ఉన్నా వివాదాస్ప‌దం అవుతుండ‌డం మ‌రో గొప్ప విష‌యం. ఇప్పుడు ఆయ‌న టీడీపీలో ఉన్నారో.. లేదో .. తేల్చుకోలేని ఒక సందిగ్ధ ప‌రిస్థితి నెల‌కొంది. అక్కడ ఆయ‌న‌ను ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదు. అస‌లు వాస్త‌వానికి వ‌స్తే.. విజ‌య‌వాడ టీడీపీ ప‌రిస్థితే బాగోలేదు. దీంతో రాధా.. ఇప్పుడు బ్యాక్ టు పెవిలియ‌న్ అంటున్నార‌ట‌. త్వ‌ర‌లోనే ఆయ‌న మ‌ళ్లీ వైసీపీలో చేరేందుకు మార్గం వెతుక్కుంటున్నార‌ని అంటున్నారు. తూర్పు గోదావ‌రికి చెందిన కాపు సామాజిక వ‌ర్గం కీల‌క నేతతో ఇటీవ‌ల ఆయ‌న విజ‌య‌వాడ‌లో భేటీ అయ్యార‌ని, త‌న‌ను వైసీపీలోకి చేర్చుకునేలా రాయ‌బారం చేయాల‌ని స‌ద‌రు నేత‌ను కోరార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

vangaveeti radha May be Joine in Janasena party
vangaveeti radha May be Joine in Janasena party

రాయబారం ఫలించేనా.. vangaveeti radha

జ‌గ‌న్ ద‌గ్గ‌ర ఇటీవ‌ల కాలంలో ఈ నేత‌కు ప‌ర‌ప‌తి పెర‌గ‌డంతో పాటు.. కొత్త నేతే అయినా.. ఇటీవ‌ల కీల‌క ప‌ద‌విని సొంతం చేసుకున్నారు. పైగా ఆయ‌న‌కు కాపు సామాజిక వ‌ర్గంలో మంచి ప‌ట్టుంది. ఈ నేప‌థ్యంలో ఈయ‌న ద్వారా అయితే.. వ‌ర్క‌వుట్ అవుతుంద‌ని.. రాధా నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలుస్తోంది. అయితే గతంలో రాధా వ్య‌వ‌హ‌రించిన తీరును కొంద‌రు విజ‌య‌వాడ నేత‌లు.. ముఖ్యంగా రెడ్డి సామాజిక వ‌ర్గానికి  చెందిన నేత‌లు మ‌ళ్లీ తెర‌మీదికి తెస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల వేళ జ‌గ‌న్‌ను అధికారంలోకి రాకుండా చూస్తానంటూ.. ఆయ‌న యాగాలు చేశార‌ని.. వారు గుర్తు చేస్తున్నారు. ఒక నిర్ణ‌యం మీద క‌ట్టుబ‌డి ఉండే నాయ‌కుడు కూడా కాద‌ని.. ప్రచారం షురూ అయిందని టాక్. అయితే జ‌గ‌న్ ఇవేవీ ప‌ట్టించుకోర‌ని.. చేర్చుకోవాల‌ని అనుకుంటే.. ఖ‌చ్చితంగా ఛాన్స్ ఇస్తార‌ని.. ఇదే మంచి స‌మ‌య‌మ‌ని.. రాధా అనుచ‌రులు అంటున్నారు.

vangaveeti radha May be Joine in Janasena party
vangaveeti radha May be Joine in Janasena party

జనసేనలో .. vangaveeti radha

ఇదిలా ఉంటే, గత స్థానిక పోరులో ఆయన జనసేన వైపు పనిచేసినట్లు టాక్ నడుస్తోంది. దీంతో వచ్చే ఎన్నికల నాటికి ఆయన జనసేనలో చేరతారని వార్తలు వెల్లువెత్తాయి. అదే సమయంలో రాధా, జనసేన నెంబర్ టూ నాదెండ్లతో భేటీ అవడం కూడా ఆ వార్తలకు ఆజ్యం పోసింది. అయితే  తానేమీ  పార్టీ మారడం లేదని, బాబు కోసమే నాదెండ్లతో భేటీ అయ్యానని ఆయన వివరణ ఇచ్చినట్లు అటు తర్వాత వార్తలొచ్చాయి. అయితే వంగవీటి విజయవాడ సెంట్రల్ నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలని భావిస్తున్నారని, దీనికి బొండా  ఉమ నుంచి ఇబ్బంది నెలకొందని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఆ ప్రాంతం నుంచి పోటీ చేయాలంటే, టీడీపీలో సాధ్యం కాకపోవచ్చన్న  వార్తల నేపథ్యంలోనే ఆయన వైసీపీ వైపు  చూస్తున్నట్లు తెలుస్తోంది. అంతా ఓకే అయితే, వంగవీటి .. వైసీపీ కండువా కప్పుకున్నట్లే.

vangaveeti radha May be Joine in Janasena party

vangaveeti radha May be Joine in Janasena party

ఇది కూడా చ‌ద‌వండి ==>  మంత్రి పదవుల కోసం ఆశపడితే… ఉన్నది కాస్తా పాయే…!

ఇది కూడా చ‌ద‌వండి ==> అమరావతి రాజధాని భూముల కుంభకోణం.. అసలు కథ నడిపిన పెద్ద తలకాయ ఆయనేనా?..

ఇది కూడా చ‌ద‌వండి ==> త్వ‌ర‌లో ఏపీ మంత్రివర్గ విస్తరణ… మంత్రుల్లో టెన్షన్ మొదలు.. ఎవ‌రు సేఫ్‌… ఎవ‌రు ఔట్‌..?

ఇది కూడా చ‌ద‌వండి ==> ఏపీ బీజేపీ కీల‌క నేత‌ చూపు వైసీపీ వైపు..?

Advertisement