kodali nani : డియర్ నిమ్మగడ్డ, నేను సైలెంట్ గానే ఉంటా – ఇట్లు కొడాలి నాని !
kodali nani : ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ని చిన్న విమర్శ చేసినా కూడా వెంటనే కౌంటర్ ఇచ్చేందుకు వైకాపా మంత్రులు పలువురు సిద్దంగా ఉంటారు. ముఖ్యంగా కొడాలి నాని కాలికి కాలు చేయికి చేయి అన్నట్లుగా ఢీ అంటే ఢీ అన్నట్లుగా ఎప్పుడు కూడా ఫుల్ ఫైర్ లో ఉంటాడు. సీఎం జగన్ మోహన్ రెడ్డి దృష్టిలో పడేందుకో లేదంటే తనకు మంత్రి పదవి ఇచ్చిన కృతజ్ఞతనో తెలియదు కాని కొడాలి నాని ఈమద్య కాలంలో జగన్ గురించి వకాల్తా పుచ్చుకుని చేస్తున్న వ్యాఖ్యలు అన్ని ఇన్నీ కావు. ఎంతో మంది సీనియర్ నాయకులు ఉన్నా కూడా వైకాపా నుండి స్పందించాలంటే వెంటనే కొడాలి నాని వైపు మీడియా వారు చూస్తున్నారు. ఎందుకంటే ఆయన స్పందిస్తే మసాలా ఉంటుంది. ఆయన మాట్లాడితే కాస్త అతిగా ఉంటుంది. అందుకే జనాలు ముఖ్యంగా మీడియా జనాలు ఆయన స్పందించాలని కోరుకుంటూ ఉంటారు.
నిమ్మగడ్డ రమేష్ విషయంలో నాని సైలెంట్…
ఏపీ ప్రభుత్వంకు కొరకరాని కొయ్యగా మారిన నిమ్మగడ్డ రమేష్ విషయంలో కొడాలి నాని కొన్నాళ్ల క్రితం ఏ రేంజ్ లో వ్యాఖ్యలు చేశాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నిమ్మగడ్డ రమేష్ విషయంలో వైకాపా నాయకులు అంతా చేసిన వ్యాఖ్యలు ఒక ఎత్తు అయితే కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు ఒక ఎత్తు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. ఆయన మరీ ఓ రేంజ్ లో విమర్శల వర్షం కురిపించేవాడు. ఇప్పుడు మాత్రం నిమ్మగడ్డ రమేష్ విషయంలో కొడాలి నాని మౌనంగా ఉంటున్నాడు. సుప్రీం కోర్టు తీర్పు వచ్చిన తర్వాత నిమ్మగడ్డ రమేష్ దూకుడుగా పంచాయితీ ఎన్నికల నిర్వహణ కు దూకుడు ప్రదర్శిస్తున్నాడు. ఈ నేపథ్యంలో కొడాలి నాని మాత్రం మౌనంగానే ఉంటున్నాడు.
వైఎస్ జగన్ క్లాస్ పీకాడా.. kodali nani
కొడాలి నాని వ్యాఖ్యలు కొన్ని సందర్బాల్లో శృతి మించాయి. దాంతో అతడి పై జనాలు అసంతృప్తి వ్యక్తం చేశారు. దాంతో కాస్త సైలెంట్ గా ఉండాలంటూ సున్నితంగా నాని ని సీఎం వైఎస్ జగన్ హెచ్చరించాడని.. నీ మాటల వల్ల నా పరువు పోతుంది అన్నట్లుగా క్లాస్ పీకాడేమో అంటూ మీడియా సర్కిల్స్ లో గుసగుసలాడుతున్నారు. నిమ్మగడ్డ రమేష్ కు ఈ విషయంలో కాస్త ఊరట కలిగించే విషయమే. మాటలతో కాకుండా చేతలతో కూడా సమాధానం చెప్తానంటూ హెచ్చరించే కొడాలి నాని సైలెంట్ అవ్వడంతో ఎన్నికల నిర్వహణ మొత్తం ప్రశాంతంగా సాగుతుందని ఈ సందర్బంగా జనాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.