Munugodu Bypoll : మునుగోడు ఉపఎన్నికపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి షాకింగ్ వ్యాఖ్యలు..
Munugodu Bypoll : అసలు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతోందో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. టీ కాంగ్రెస్ లో నేతల మధ్య మర్గ పోరు పార్టీ దశదిశనే మార్చేలా ఉంది. పార్టీ పరువును బజారుకీడుస్తోంది. ఇప్పటికే పలువురు నేతలు పార్టీని వీడి పార్టీకి షాక్ ఇచ్చారు. మరోవైపు కోమటిరెడ్డి బ్రదర్స్ వ్యవహారం కూడా పార్టీలో వర్గపోరును ఇంకాస్త పెంచింది. ఇటీవల పలు కీలక వ్యాఖ్యలు చేసిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తాజాగా మరికొన్ని వ్యాఖ్యలు చేశారు.
తనను పార్టీ నుంచి పంపించే కుట్ర చేస్తున్నారని.. తన వెనుక చాలా కుట్ర నడుస్తోందని ఆయన ఇటీవల వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన ఒక అడుగు వెనక్కి వేసి కొన్ని షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ఉపఎన్నికల్లో పార్టీ తరుపున ప్రచారం చేయడానికి రెడీ అని తెలిపారు. కాకపోతే పార్టీ స్టార్ క్యాంపెయినర్ గా తనకు బాధ్యతలు అప్పగిస్తే ప్రచారం చేయడానికి తాను రెడీ అని చెప్పారు. వెంకట్ రెడ్డి తాజాగా చేసిన ప్రకటనతో ఆయన మళ్లీ పార్టీలో యాక్టివ్ అవబోతున్నట్టు తెలుస్తోంది.
Munugodu Bypoll : కేసీఆర్ పై వెంకట్ రెడ్డి ఆగ్రహం
తాజాగా మీడియాతో మాట్లాడిన వెంకట్ రెడ్డి.. సీఎం కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. దక్షిణ తెలంగాణపై కేసీఆర్ వివక్ష చూపుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాలే ఉన్నాయా? అక్కడ మాత్రమే అభివృద్ధి చేస్తున్నారు. మిగితా నియోజకవర్గాల పరిస్థితి ఏంటి? సీఎం ఫామ్ హౌస్ చుట్టూ రూ.600 కోట్లతో 3 నెలల్లో రోడ్లు వేశారు. మరి.. మునుగోడులో ఒక చిన్న రోడ్డు వేయడానికి ఏడాది సమయం ఎందుకు తీసుకుంది. పిలాయిపల్లి కాలువ పరిస్థితి ఏంటి? రూ.350 కోట్లతో ప్రారంభిస్తానని చెప్పి ఏం చేశారంటూ ప్రశ్నించారు.
గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గాల్లో 20 వేల డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మిస్తే.. మనుగోడులో మాత్రం ఒక్క డబుల్ బెడ్ రూం ఇల్లు కూడా నిర్మించలేదంటూ దుయ్యబట్టారు. అలాగే.. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా ఆయన దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుడు అని కొనియాడారు.