
konda vishweshwar reddy Meet With Revanth reddy
Revanth reddy తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. పీసీసీ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన రేవంత్‌రెడ్డి Revanth reddy ముఖ్యనేతలందరితో భేటీ అయ్యారు. ఏడేళ్లుగా అధికారానికి దూరమైన కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే క్రమంలో పార్టీ కొత్త, పాత , సీనియర్ల నేతల సమన్వయంతో ముందుకెళ్లేందుకు రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. అలాగే, పార్టీని వీడిన వారిని తిరిగి రప్పించేందుకు బుజ్జగింపులు మొదలు పెట్టారు. తాజాగా మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి konda Vishweshwar reddy తో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ పార్టీ శ్రేణుల్లో కొంత జోష్ కనిపిస్తోంది. ఈ క్రమంలో వివిధ పార్టీల నేతలు కూడా కాంగ్రెస్‌లో చేరేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి konda Vishweshwar reddy ని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి Revanth reddy కలిశారు. కొండా విశ్వేశ్వర్‌రెడ్డి నివాసానికి వెళ్లిన రేవంత్‌రెడ్డి తాజా రాజకీయ పరిస్థితులపై ఆయనతో చర్చించారు. తొలుత టీఆర్ఎస్ పార్టీ ఎంపీగా గెలుపొందిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి.. గత లోక్‌సభ ఎన్నికల్లో టికెట్ దక్కలేదు. దీంతో కొండా విశ్వేశ్వర్‌రెడ్డి గులాబీ పార్టీకి గుడ్‌బై చెప్పి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
konda vishweshwar reddy Meet With Revanth reddy
అయితే, నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక తర్వాత కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడిన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌పార్టీకి రాజీనామా చేసిన తర్వాత పలువురు నేతలతో భేటీ అయినప్పటికీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఇంత వరకు ఏ రాజకీయ పార్టీలో చేరలేదు. ఈ నేపథ్యంలో ఇవాళ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి konda Vishweshwar reddy తో రేవంత్‌రెడ్డి భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుతారనే ఊహాగానాలు కూడా గతంలో వినిపించాయి. తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఇవాళ మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డితో సమావేశం అయ్యారు.. గతంలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డిని తిరిగి పార్టీలోకి రావాలని ఆహ్వానించడం.. కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కూడా రెడీగా ఉన్నట్టు వారి మాటల్లో అర్థం అవుతోంది.. కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత.. బీజేపీలో చేరడం ఖాయం అనే ప్రచారం జరిగినా.. కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మాత్రం కాంగ్రెస్ గూటికి చేరడానికే ఉత్సాహంగా ఉన్నారని అర్థం అవుతోంది. ఇక, కొండా విశ్వేశ్వర్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినా.. ఐడియాలజీకి చేయలేదని.. ఆయన ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీలోకి రావొచ్చు అని ఆహ్వానించారు రేవంత్ రెడ్డి. ఇక, కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు చేరాలనేది త్వరలోనే చెబుతా అన్నారు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి.
congress party
పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిని తానే స్వయంగా వెళ్లి కలుద్దాం అనుకున్నానని.. కానీ, ఆయనే వస్తానని వచ్చారని.. తెలిపారు. ఈ స్టేట్‌మెంట్‌తో కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరడం ఖాయం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.. కాగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీచేసి ఎంపీగా విజయం సాధించిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డి.. కొంతకాలం చురుకుగా పనిచేసినా.. ఆ తర్వాత టీఆర్ఎస్‌కు రాజీనామా చేసి.. కాంగ్రెస్ పార్టీలో చేరారు.. ఇక, సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత.. కొంత కాలానికి కాంగ్రెస్ పార్టీకి కూడా కొండా విశ్వేశ్వర్‌రెడ్డి రాజీనామా చేసి సైలెంట్‌గా ఉంటున్నారు.. ఇదే సమయంలో.. పలువురు నేతలతో కొండా విశ్వేశ్వర్‌రెడ్డి సమావేశం కావడం.. ఇతర చర్చలకు కూడా దారితీసిన సంగతి తెలిసిందే. మరోవైపు.. రేవంత్ రెడ్డికి పీసీసీ ఇస్తే.. కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వస్తారనే ప్రచారం కూడా సాగింది. మొత్తంగా మళ్లీ కాంగ్రెస్ లోకి రీ ఎంట్రీకి సిద్ధమైనట్టు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి ==> సొంత జిల్లాలో సీఎం కేసీఆర్ కు భారీ షాక్.. టీఆర్ఎస్ గ్రాఫ్ తగ్గుతుందా..?
ఇది కూడా చదవండి ==> అన్న అలా… తమ్ముడు ఇలా… కోమటి బ్రదర్స్ రాజకీయం అదుర్స్…!
ఇది కూడా చదవండి ==> కౌశిక్ రెడ్డి రాజీనామాతో రంజుగా మారిన హుజురాబాద్ రాజకీయం..!
ఇది కూడా చదవండి ==> నెక్స్ ట్ హరీష్ రావేనా… ఫోకస్ పెంచిన కేసీఆర్… ఆ ఎన్నిక ముగియగానే..?
Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…
Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…
Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్ తన పేరుతో జరుగుతున్న మోసాలపై…
Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…
Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…
Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…
Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…
Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…
This website uses cookies.