ఓహో.. జానారెడ్డి మనసులో అది ఉందా? బీజేపీ చేరికపై ఫుల్లు క్లారిటీ ఇచ్చేశారు?
తెలంగాణలో మాత్రం వరుసగా ఎన్నికలు వస్తున్నాయి. మొన్న దుబ్బాక ఉపఎన్నిక.. నిన్న జీహెచ్ఎంసీ ఎన్నికలు.. నేడో రేపో నాగార్జునసాగర్ ఉపఎన్నిక జరగనుంది. అయితే.. దుబ్బాక ఉపఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీపై ప్రజలు చూపించిన వ్యతిరేకతను టీఆర్ఎస్ పార్టీ జీర్ణం చేసుకోలేకపోతోంది. ఏది ఏమైనా నాగార్జునసాగర్ ఉపఎన్నికలో గెలిచి తమ సత్తా చాటాలని విశ్వప్రయత్నం చేస్తోంది. అందుకే ఇప్పటికే సీఎం కేసీఆర్ యాక్టివ్ అయ్యారు. నాగార్జునసాగర్ ఉపఎన్నికపై ఫోకస్ పెట్టారు. అయితే.. నాగార్జునసాగర్ ఉపఎన్నికలో ఎక్కువగా వినిపిస్తున్న […]
తెలంగాణలో మాత్రం వరుసగా ఎన్నికలు వస్తున్నాయి. మొన్న దుబ్బాక ఉపఎన్నిక.. నిన్న జీహెచ్ఎంసీ ఎన్నికలు.. నేడో రేపో నాగార్జునసాగర్ ఉపఎన్నిక జరగనుంది. అయితే.. దుబ్బాక ఉపఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీపై ప్రజలు చూపించిన వ్యతిరేకతను టీఆర్ఎస్ పార్టీ జీర్ణం చేసుకోలేకపోతోంది. ఏది ఏమైనా నాగార్జునసాగర్ ఉపఎన్నికలో గెలిచి తమ సత్తా చాటాలని విశ్వప్రయత్నం చేస్తోంది. అందుకే ఇప్పటికే సీఎం కేసీఆర్ యాక్టివ్ అయ్యారు. నాగార్జునసాగర్ ఉపఎన్నికపై ఫోకస్ పెట్టారు.
అయితే.. నాగార్జునసాగర్ ఉపఎన్నికలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు జానారెడ్డి. ఆయన గురించే ప్రస్తుతం తెలంగాణలో చర్చ. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అయితే.. ఆయన కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరుతున్నారంటూ గత కొంత కాలంగా విపరీతంగా వార్తలు వస్తున్నాయి. దానిపై జానా రెడ్డి ఫుల్లు క్లారిటీ ఇచ్చేశారు.
మీతో ఎవరైనా సంప్రదించారా?
గాంధీ భవన్ లో జరిగిన కాంగ్రెస్ కోర్ కమిటీ మీటింగ్ లో పాల్గొన్న జానారెడ్డి.. మీడియాతో మాట్లాడారు. మీరు వేరే పార్టీలో చేరుతున్నట్టుగా ప్రచారం సాగుతోంది.. టీఆర్ఎస్ నేతలు కానీ… బీజేపీ నేతలు కానీ.. మిమ్మల్ని సంప్రదించారా? అంటూ మీడియా ప్రశ్నించగా… మిమ్మల్ని ఎవరైనా సంప్రదించారా? అంటూ జానారెడ్డి.. మీడియాను ఎదురు ప్రశ్నించారు.
మిమ్మల్ని ఎవరైనా సంప్రదిస్తే.. వాళ్లను నా వద్దకు తీసుకురండి.. వాళ్లలో అప్పుడు చర్చించి మాట్లాడుతా.. అంటూ జానారెడ్డి స్పష్టం చేశారు.
మరి.. నాగార్జున సాగర్ లో పోటీ చేస్తున్నారా? అంటూ ప్రశ్నించగా.. నేను పోటీ చేయడం కాదు.. కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు నాగార్జున సాగర్ లో పోటీ చేయాలనేది పార్టీ అధిష్ఠానం చూసుకుంటుంది. పీసీసీకి ఎవరు అధ్యక్షుడు ఉండాలి.. అనేదానిపై నా నిర్ణయాన్ని నేను కోర్ కమిటీకి చెప్పాను.. అంటూ జానారెడ్డి చెప్పారు.
అయితే.. గత కొన్ని రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీని వీడి.. జానారెడ్డి బీజేపీలో చేరుతున్నారనేది అవాస్తమే. అది నిజం కాదు. ఒకవేళ జానారెడ్డి.. నాగార్జునసాగర్ ఉపఎన్నికలో కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తే… టీఆర్ఎస్ పార్టీకి.. జానారెడ్డా గట్టి పోటీని ఇచ్చినట్టే. ఎందుకంటే.. నాగార్జున సాగర్.. జానారెడ్డి కంచుకోట. చూడాలి మరి.. నాగార్జునసాగర్ ఉపఎన్నికను టీఆర్ఎస్ పార్టీ ఎలా ఎదుర్కుంటుందో?