Khammam : అద్భుత కట్టడం.. కూసుమంచి గణపేశ్వరాలయం
Khammam : ఇటీవలే కాకతీయ కాలంలో నిర్మించిన రామప్ప గుడికి యునెస్కో గుర్తింపు లభించింది. నిజంగా రామప్ప కట్టడం అనేది ఒక అద్భుతం. ఇప్పటికీ.. ఆ కట్టడాన్ని ఎలా నిర్మించారా? అని మేధావులే ఆశ్చర్యపోతున్నారు. అలాంటి అద్భుత కట్టడాలు.. తెలంగాణలో చాలా ఉన్నాయి. ఖమ్మం జిల్లాలోని కూసుమంచిలో ఉన్న గణపేశ్వరాలయం కూడా అటువంటిదే.
కాకతీయుల కాలంలో నిర్మించిన కూసుమంచి గణపేశ్వరాలయం.. పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. కూసుమంచిలో నిర్మించిన ఈ గణపేశ్వరాలయంలో… గణపతి దేవుడు.. పెద్ద శివలింగాన్ని ప్రతిష్ఠించారు. ఈ గుడిని కాకతీయుల కాలంటో.. గణపతిదేవుడు నిర్మించారు.
ఈ ఆలయంలో ఉన్న ప్రతి స్తంభం, ప్రతి శిల్పానికి ఒక ప్రాధాన్యత ఉంటుంది. వాటిని చూస్తేనే మైమరిచిపోతాం. అందుకే.. పర్యాటకులను ఈ దేవాలయం ప్రత్యేకంగా ఆకర్షిస్తోంది. ఈ దేవాలయాన్ని కూడా గణపతి దేవుడు నక్షత్రాకారంలో నిర్మించారు. ఆ గుడిలో ఉండే శివలింగం సుమారు మూడున్నర అడుగులు ఉంటుంది. ఈ కట్టడం కింద కూడా ఇసుక ఉంటుంది. ఇసుక మీద ఈ కట్టడాన్ని నిర్మించారు. భూకంపాలను తట్టుకునేలా.. కాకతీయలు ఆ టెక్నాలజీని వాడి కట్టడాలు నిర్మించేవారు.