PAN Card : పాన్ కార్డు, ఆధార్ కార్డుల లింక్ చేశారా? లేదంటే అంతే సంగతులు..
PAN Card : ఆర్థిక పర విషయాల్లో ప్రస్తుతం పాన్ కార్డు తప్పనిసరిగా మారింది. పాన్ కార్డు, ఆధార్ కార్డు లింక్ చేయడం తప్పనిసరని కేంద్ర ప్రభుత్వం మొదటి నుంచీ చెబుకుంటూ వస్తోంది. ఇందు కోసం చాలా సార్లు గడువు సైతం పెంచింది. ప్రస్తుతం పెంచిన గడువు కూడా కొద్ది రోజుల్లోనే ముగుస్తుండటంతో పాన్, ఆధార్ లింగ్ చేయని వారు వెంటనే అలెర్ట్ కావాలి. లేదంటే భవిష్యత్తులో అనేక ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. గడువులోగా పాన్ ఆధార్ లింక్ చేయకపోతే సదురు పాన్ కార్డును క్యాన్సిల్ చేసే అవకాశముంటుంది. మళ్లీ దీనిని తిరిగి పొందాలంటే తొందరగా సాధ్యమయ్యే పని కాదు.
పాన్, ఆధార్ కార్డు లింక్ చేసేందుకు 2022 మార్చి 31 వరకు ప్రభుత్వం గడువు విధించింది. అంతలోపు లింక్ చేసుకుని వారి పాన్ కార్డులు ఇక పనిచేయవనే చెప్పాలి. పాన్ కార్డు అవసరం ఉన్న బ్యాంక్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్ తదితర వాటిలో ఖాతాలు నిర్వహించడం సాధ్యం కాదు. ఒక వేళ చెల్లని పాన్ కార్డు ఉపయోగిస్తే అందుకు సుమారు రూ. పది వేల వరకు ఫైన్ చెల్లించాల్సి వస్తుంది. అందుకే వెంటనే పాన్ కార్డును, ఆధార్ కార్డును లింగ్ చేయండి. అందుకు ఇన్ కమ్ ట్యాక్ అధికారక వెబ్‌సైట్ ను సందర్శించండి. అందులో వివరాలు ఎంటర్ చేయండి.
PAN Card : రూ.10 వేల వరకు ఫైన్..
తర్వాత క్యాప్చాను టైప్ చేయండి తర్వాత లింక్ ఆధార్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి. అంతే మీ ఆధార్, పాన్ రెండూ లింక్ అయిపోతాయి. దీని వల్ల బ్యాంక్ ఖాతాలు నిర్వహణ, మ్యూచువల్ ఫండ్, స్టాక్ మార్కెట్లకు సంబంధించిన వంటి వాటికి ఎలాంటి ఇబ్బంది కలగదు. భవిష్యత్తులోనూ ఎలాంటి సమస్యలు ఎదురవవు. మరీ మీ పాన్ కార్డుతో ఆధార్ కార్డు లింక్ చేశారా..? ఆలస్యం చేయకండి మరి..