Telangana : తెలంగాణలో ఒమిక్రాన్ కలవరం.. ఆ గ్రామంలో లాక్ డౌన్..!
Telangana తెలంగాణలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు వేగం పుంజుకుంటోంది. తాజాగా సిరిసిల్ల జిల్లాలోని గూడెం గ్రామంలో 3 ఒమిక్రాన్ కేసులు నమోదవ్వగా.. అప్రమత్తమైన అధికారులు ఆ గ్రామంలో లాక్‌డౌన్ విధించారు. దుబాయ్ నుంచి ఇటీవల దేశానికి తిరిగొచ్చిన ఓ వ్యక్తికి హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో టెస్టులు చేయగా.. నెగిటివ్ వచ్చింది.
కానీ స్వస్థలం గూడెం గ్రామానికి చేరుకున్న అనంతరం.. అతడిలో జలుబు వంటి స్వల్ప లక్షణాలు కనిపించడంతో కోవిడ్ టెస్టులు చేయగా.. అతనికి ఒమిక్రాన్ నిర్ధారణ అయింది. దీంతో వైద్యాధికారులు వారి కుటుంబ సభ్యులకు వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. అందులో ఇద్దరికీ పాజిటివ్ అని తేలడంతో.. బాధితుడి ఆరుగురు కుటుంబ సభ్యులను, అతడు కలిసిన మరో ఏడుగురిని అధికారులు క్వారంటైన్లోకి పంపారు.
![Telangana తెలంగాణలో ఒమిక్రాన్ కలవరం ఆ గ్రామంలో లాక్ డౌన్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్తలు Lockdown due to Omikran varient in siricilla district telangana](https://thetelugunews.com/wp-content/uploads/2021/12/Telangana.jpg)
Lockdown due to Omikran varient in siricilla district telangana
ముందస్తు జాగ్రత్తగా.. ఆ గ్రామ పంచాయతీ పాలక వర్గం ఊరిలో 10 రోజులపాటు లాక్‌డౌన్ విధిస్తూ ఎవరూ తమ ఇళ్ళ నుంచి బయటకు రాకు కఠిన ఆంక్షలు విధించింది. మరోవైపు రోజురోజుకు రాష్ట్రంలో పెరుగుతున్న కేసుల సంఖ్య ఆందోళనకు గురి చేస్తోంది.బుధవారం ఒక్క రోజే కొత్తగా 14 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయని తెలంగాణ ఆరోగ్య శాఖ వెల్లడించింది.