LPG Gas : ఎల్‌పీజీ గ్యాస్ వాడే వారికి గుడ్ న్యూస్..!
ప్రధానాంశాలు:
LPG Gas : ఎల్‌పీజీ గ్యాస్ వాడే వారికి గుడ్ న్యూస్..!
LPG Gas : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో “దీపం-2 పథకం” కింద మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ జరుగుతోంది. ఈ పథకం ద్వారా ప్రతి మహిళకు సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నారు. ఇప్పటికే మొదటి ఉచిత సిలిండర్ పంపిణీ పూర్తి కాగా, ఇప్పుడు రెండవ ఉచిత సిలిండర్ పంపిణీ ప్రారంభమైంది. పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ విషయాన్ని వెల్లడిస్తూ రాష్ట్ర ప్రజలు రెండవ ఉచిత గ్యాస్ సిలిండర్‌ను బుక్ చేసుకోవాలని కోరారు.

LPG Gas : ఎల్‌పీజీ గ్యాస్ వాడే వారికి గుడ్ న్యూస్..!
ఈ ఉచిత గ్యాస్ సిలిండర్లు ఎల్‌పీజీ కనెక్షన్ కలిగిన రేషన్ కార్డు, ఆధార్ కార్డు మరియు ఆధార్-రైస్ కార్డు అనుసంధానం చేసిన వారికి అందించబడుతున్నాయి. ప్రతి సంవత్సరం ఏప్రిల్-జూలై, ఆగస్టు-నవంబర్, డిసెంబర్-మార్చి మధ్యలో ప్రతి నాలుగు నెలలకు ఒక సిలిండర్ ఉచితంగా ఇవ్వబడుతుంది. 24 గంటల్లో నగదు చెల్లింపు పద్ధతిలో సిలిండర్ తీసుకున్న వారికి వారి బ్యాంక్ అకౌంట్‌లో డబ్బు జమ అవుతుంది. ఈ స్కీమ్ ద్వారా రాష్ట్రంలో ఇప్పటికే 90 లక్షల సిలిండర్లు పంపిణీ చేసినట్లు మంత్రి తెలిపారు.
ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం మహిళలకు చాలా ఉపశమనం కలిగిస్తుందని, సబ్సిడీ డబ్బులు త్వరగా బ్యాంక్ అకౌంట్‌లో జమ అవుతున్నట్లు వినియోగదారులు చెప్పుకుంటున్నారు. పవిత్ర అనే విశాఖ వాసి ఈ పథకం ద్వారా తన మొదటి సిలిండర్ తీసుకున్న తర్వాత 2 రోజుల్లోనే సబ్సిడీ డబ్బులు తన అకౌంట్‌లో జమ అయ్యాయని చెప్పారు. ఇప్పుడు రెండవ విడత సిలిండర్ బుక్ చేసుకోవచ్చు అని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. జూలై చివరివరకు రెండవ విడత గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునే అవకాశం ఉందని, ఇది మహిళలకు మరింత సౌకర్యాన్ని కలిగిస్తుందని పేర్కొన్నారు.