Panasa Kaya Biryani : పెళ్లిళ్ల స్పెషల్ పనస కాయ బిర్యాని… ఎంతో ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోండి..
Panasa Kaya Biryani : అందరూ సహజంగా చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, దమ్ బిర్యాని, ఎగ్ బిర్యానీ, వెజ్ బిర్యానీ ఇలా రకరకాలుగా తింటూ ఉంటారు. అయితే అప్పుడప్పుడు మాత్రమే పనస బిర్యానీని చూస్తూ తింటూ ఉంటారు. ఇది ఇప్పుడు పెళ్లిళ్లలో సర్వ్ చేయడం ట్రెండీగా మారింది.. అటువంటి బిర్యానీ ఇప్పుడు ఇంట్లో ఈజీగా తయారు చేసుకుందాం…
కావాల్సిన పదార్థాలు : మిరియాలు, ధనియాలు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, అనాసపువ్వు, పత్తర పువ్వు ,బిర్యానీ ఆకు, అల్లం ఎల్లిపాయలు, జీలకర్ర, సోంపు, పనసకాయ ముక్కలు, మజ్జిగ, బాస్మతి రైస్, ఉల్లిపాయలు,డబుల్ బీన్స్, పచ్చిమిర్చి, ఉప్పు, టమాటాలు, కొత్తిమీర, పుదీనా, పసుపు, కారం, పాలు, నిమ్మరసం, నెయ్యి, నూనె, మొదలైనవి… తయారీ విధానం : ముందుగా స్టవ్ పై ఒక కడావి అని పెట్టుకుని దానిలో ఒక చిన్న కప్పు మిరియాలు, ఒక రెండు స్పూన్లు ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ సోంపు, ఒక బిర్యానీ ఆకు, జాపత్రి, లవంగాలు, యాలకులు వేసి బాగా వేయించుకున్న తర్వాత పత్తర పువ్వు, ఏసి వేయించుకొని వాటిని మిక్సీ జార్ లో వేసేముందు నాలుగు అల్లం ముక్కలు, నాలుగు ఎల్లిపాయలు వేసి మెత్తటి పేస్టులా పట్టి పక్కన పెట్టుకోవాలి.
తర్వాత మందపాటి గిన్నెను పెట్టుకొని దానిలో నాలుగైదు స్పూన్ల ఆయిల్ ని వేసి కోని దానిలో కొంచెం సాజీర, కొంచెం జీలకర్ర, నాలుగైదు పచ్చిమిర్చి, ఒక కప్పు ఉల్లిపాయలు వేసి ఎర్రగా వేయించుకున్న తర్వాత దానిలో ఒక కప్పు టమాటా ముక్కలు, ఒక కప్పు కొత్తిమీర, ఒక కప్పు పుదీనా, వేసి బాగా కలుపుకొని, తర్వాత కొంచెం కారం, కొంచెం ఉప్పు కొంచెం గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత పనసకాయ ముక్కలను ముందే మజ్జిగలో నానబెట్టి తీసి నూనెలో వేయించి పక్కన పెట్టుకోవాలి. వాటిని తీసుకొని ఇప్పుడు ఈ మిశ్రమంలో ఏసి బాగా కలుపుకొని, తరువాత దానిలో ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని వేసి కలుపుకొని తర్వాత ఐదు కప్పుల నీళ్లను వేసి మూత పెట్టి 15 నిమిషాల వరకు ఉడకనివ్వాలి. ఒక ఐదు నిమిషాలు ముందు మూతను తీసి దానిలో కొద్దిగా నెయ్యిని వేసి కొద్దిగా గంటెతో అటు ఇటు అని ఒక ఐదు నిమిషాల వరకు మూతను పెట్టి ఉంచాలి. తరువాత స్టవ్ ఆపి ఒక ఐదు నిమిషాలు ఉంచాలి. ఐదు నిమిషాల తర్వాత ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. అంతే పెళ్లిళ్ల స్పెషల్ పనసకాయ బిర్యాని రెడీ.