Makhana | మఖానా, పల్లీలు… ఈ రెండింట్లో ఏది తింటే బరువు తగ్గుతారు.. నిపుణుల సూచనలు
Makhana | మఖానా (ఫాక్స్ నట్స్) తినడం ఆరోగ్యానికి అనేక విధాలుగా ఉపయోగకరమని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఇందులో పుష్కలంగా ఉండే పోషకాలు శరీరానికి శక్తినిచ్చి, అనారోగ్య సమస్యలను దూరం చేస్తాయి. ముఖ్యంగా వేరుశెనగ గింజలతో పోలిస్తే మఖానా ఎన్నో రెట్లు ఆరోగ్యకరమని నిపుణులు పేర్కొంటున్నారు.

#image_title
ఏది బెస్ట్..
మఖానా తినడం వల్ల కడుపు త్వరగా నిండిన భావన కలుగుతుంది. దాంతో అధికంగా తినాలనే అలవాటు తగ్గి, బరువు నియంత్రణలోకి వస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఇది సహజసిద్ధమైన ఆహారంగా సహాయపడుతుంది. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తూ శరీరాన్ని చురుకుగా ఉంచుతుంది.
ఆరోగ్య నిపుణుల ప్రకారం, వేరుశెనగలతో పోలిస్తే మఖానా శరీరానికి మరింత మేలు చేస్తుంది. వేరుశెనగలు ఎక్కువగా తింటే బరువు పెరగడానికి దారి తీస్తే, మఖానా మాత్రం బరువు తగ్గించడంలో తోడ్పడుతుంది. అయితే వీటిని నేరుగా కాకుండా స్వల్పంగా వేయించి తింటే మరింత రుచిగా, సులభంగా జీర్ణమవుతాయి. పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరికీ మఖానా ఆహారంలో భాగం చేస్తే ఆరోగ్యానికి మేలు చేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.