Goat Head Curry : తలకాయ కూర ఇలా చేసారంటే.. లొట్టలేసుకుంటూ తింటారు.!!
Goat Head Curry : మటన్ ఆరోగ్యానికి ఎంత మంచిదో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా తలకాయ కూర ఆరోగ్యానికి చాలా మంచిది. తలకాయ కూర సూప్ తాగినా కూడా మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. తలకాయ కూరను చాలామంది తినడానికి ఇష్టపడరు. కానీ ఇది ఆరోగ్యపరంగా చాలా మంచిది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు తలకాయ కూరను తింటే లోపలి పిండం మంచిగా ఎదుగుతుందని మన పెద్దవాళ్లు అంటుంటారు. అయితే కొందరు మహిళలు తలకాయ కూరను తినడానికి ఇష్టపడరు. అలాంటివారు తలకాయ కూరను ఇలా చేశారంటే విడిచి పెట్టకుండా లొట్టలేసుకుంటూ తింటారు. ఇంకెందుకు ఆలస్యం.. తలకాయ కూరను ఎలా చేసుకోవాలో, దానికి కావలసిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు: 1) తలకాయ 2) పచ్చిమిర్చి 3) ఉల్లిపాయలు 4) ధనియాలు 5) లవంగాలు 6) యాలకులు 7) దాల్చిన చెక్క 8) జాజిపువ్వు 9)ఎల్లిపాయలు 10) బిర్యానీ ఆకులు 11) ఆయిల్ 12) కరివేపాకు 13) అల్లం పేస్ట్ 14) టమాట 15) పసుపు 16) కారం 17) ఉప్పు 18) ఎండు కొబ్బరి 19) కొత్తిమీర తయారీ విధానం: ముందుగా ఒక పాన్ తీసుకొని అందులో ఒక స్పూన్ ధనియాలు, ఆరు లవంగాలు, మూడు యాలకులు, రెండు లేదా మూడు దాల్చిన చెక్కలు, ఒక జాజిపూవు వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి. తర్వాత వీటిని మిక్సీ లేదా రోట్లో వేసి మెత్తగా పొడి లాగా చేసుకోవాలి. చివర్లో 6 లేదా 7 ఎల్లిపాయలను వేసి దంచుకోవాలి. తర్వాత కుక్కర్లో ఐదు స్పూన్ల ఆయిల్ వేసి ఒక జాజిపువ్వు, రెండు లేదా మూడు బిర్యానీ ఆకులు వేసి కొంచెం వేగాక రెండు లేదా మూడు ఉల్లిపాయలను మెత్తగా మిక్సీ పట్టుకొని అందులో వేయాలి.
తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో చెంచాన్నర అల్లం పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంతవరకు వేయించుకోవాలి. తర్వాత ఆరు పచ్చిమిర్చిలను వేసి కలిపి రెండు లేదా మూడు టమాట ముక్కలను వేసి బాగా వేయించుకున్న తరువాత ఇందులో కడిగి పెట్టుకున్న తలకాయ మాంసాన్ని వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో అర స్పూన్ పసుపు, మూడు స్పూన్ల కారం, సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకొని పైన మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి. తర్వాత ఒక లీటర్ నీళ్లు పోసి బాగా కలుపుకొని కుక్కర్ కి మూత పెట్టుకొని 10 ,12 విజిల్స్ వచ్చేవరకు ఉంచాలి. తర్వాత ఇందులో ముందుగా దంచి పెట్టుకున్న మసాలా, ఒక స్పూన్ ఎండు కొబ్బరి పొడి వేసి బాగా కలుపుకొని చివర్లో కొత్తిమీర వేసి బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి. తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుంటే ఎంతో టేస్టీ అయిన తలకాయ కూర రెడీ. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ క్రింది వీడియో లింక్ ను క్లిక్ చేయండి.