Goat Head Curry : మేక తలకాయ కూర తింటే ఇన్ని ప్రయోజనాల… తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే…!
ప్రధానాంశాలు:
Goat Head Curry : మేక తలకాయ కూర తింటే ఇన్ని ప్రయోజనాల... తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే...!
Goat Head Curry : తెలంగాణ రాష్ట్రంలో తలకాయ కూరకు ఎంతటి ప్రాముఖ్యత ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ చిన్న ఫంక్షన్ జరిగినా సరే తలకాయ కూర ఖచ్చితంగా ఉండాల్సిందే. అయితే తెలంగాణ రాష్ట్రంలో చాలామంది తలకాయ కూరను ఎంతో ఇష్టంగా తింటున్నప్పటికీ కొన్ని రాష్ట్రాలలో మాత్రం దీనిని ఎక్కువగా ఇష్టపడరు. కానీ వాస్తవానికి తలకాయ కూర తినడం వలన ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా…మరి అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Goat Head Curry రోగ నిరోధక శక్తిని పెంచుతుంది….
మేక తలకాయ కూర లో విటమిన్ బి 12 ప్రోటీన్స్ ఫాస్పరస్ మరియు ఐరన్ అధికంగా ఉంటాయి. అలాగే ఇందులో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు కూడా ఉన్నాయి.
అలాగే మేక తలకాయ కూర రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.
Goat Head Curry రక్తహీనతను నివారిస్తుంది
మేక తలకాయ కూర ఇనుము లోపం వల్ల ఏర్పడే రక్తహీనతను నివారించడానికి దోహాధపడుతుంది.
కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది.
కీళ్ల నొప్పులును తగ్గించడానికి తలకాయ కూర లో ఉండే గ్లూకోసమైన్ మరియు కాండ్రాయీటీన్ బాగా సహాయపడతాయి.
ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
మేక తలకాయ కూరలో ఫాస్పరస్ మరియు క్యాల్షియం ఎక్కువగా ఉండడం వలన ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
గుండె జబ్బుల ప్రమాదం నుండి మేక తలకాయ కూరలో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు సహాయపడతాయి.
చర్మాని ఆరోగ్యంగా ఉంచుతుంది.
మేక తలకాయ కూరలు విటమిన్ సి అధికంగా ఉండడం వలన ఇది కొల్లాజేన్ ఉత్పత్తిని పెంచుతుంది. దీని ద్వారా చర్మాన్ని స్థితి స్థాపకంగా మరియు యవ్వనంగా ఉంచడానికి సహాయపడుతుంది.
క్యాన్సర్ ను నివారిస్తుంది.
క్యాన్సర్ కు కారణమయ్యే ఫ్రీ రాడికల్స్ వలన కలిగే నష్టం నుంచి శరీరాన్ని రక్షించడానికి మేక తలకాయ కూరలో యాంటీఆక్సిడెంట్లు ఎంతగానో సహాయ పడతాయి.
కళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
మేక తలకాయ కూరలో విటమిన్ అధికంగా ఉండడం వలన ఇది కళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలోను మరియు రాత్రిపూట దృష్టిని పెంచడానికి ఎంతగానో దోహదపడుతుంది.