Chandrababu Naidu : అధికారంలో లేనప్పుడే బాబుకు వారు ఎందుకు గుర్తుకు వస్తున్నారు?
Chandrababu Naidu : తెలుగుదేశం పార్టీకి అధికారం లేనప్పుడు మాత్రమే బ్రాహ్మణులు, బ్రాహ్మణ సంఘాల వారు గుర్తుకు వస్తారని.. అధికారంలో ఉన్నప్పుడు మాత్రం వారిని అవమానించడం, వారిని పక్కకు పెట్టడం చేస్తారని వైకాపా ఎమ్మెల్యే మల్లాది విష్ణు ధ్వజమెత్తారు. ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ఉండవల్లి అరుణ్ కుమార్, దువ్వూరి సుబ్బారావు, ఐ వై ఆర్ కృష్ణ రావు, ఎల్వీ సుబ్రమణ్యం లు ఇప్పుడు ఈనాడు రామోజీ రావు, చంద్రబాబు నాయుడు లకు బంధువులు అన్నట్లుగా మారి పోయారు. వారు ఏం మాట్లాడినా, వ్యాఖ్యలు చేసినా కూడా ఈనాడు లో ప్రముఖంగా వార్తలు వస్తున్నాయి.
వారిని మేధావులు అన్నట్లుగా ఈనాడులో రాతలు ఉంటున్నాయి. చంద్రబాబు నాయుడు, రామోజీ రావుల సామాజిక వర్గం వారి యొక్క వ్యాఖ్యలను ఇప్పుడు ఎందుకు ముద్రించడం లేదు.. వారిని మేధావులుగా ఎందుకు పేర్కొనడం లేదంటూ మల్లాది విష్ణు ప్రశ్నించారు. ప్రతి ఒక్కరికి వాక్ స్వతంత్రం ఉంటుంది. కానీ ఈనాడు టిడిపికి మాత్రం రెండు మూడు రకాల వాక్ స్వతంత్రం ఉన్నట్లుగా అనిపిస్తుంది. అందులో ఒకటి అనని మాటలు అన్నట్లుగా చెప్పే వాక్ స్వతంత్రం, రెండవది తమకు అనుకూలంగా మాట్లాడితే వారి మాటలను పదింతలు చేసి చూపించే వాక్ స్వతంత్రం, మూడవది ప్రత్యర్థి పార్టీ అధికారంలో ఉంటే ఎవరైనా ఎదురు తిరిగితే వారిని విమర్శించడం, ఇష్టానుసారంగా ఆరోపణలు చేసే వాక్ స్వతంత్రం. ఇలా వారికే చెల్లింది.
గతంలో దువ్వూరి సుబ్బారావు ఇతర బ్రాహ్మణులను టిడిపి ఏ విధంగా అవమానపర్చిందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. టిడిపి అధికారంలో లేకపోతే ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యలను ఫ్రంట్ పేజీలో వేస్తారని, కృష్ణా రావు వ్యాఖ్యలు టిడిపి కి అనుకూలంగా ఉంటేనే ప్రచురిస్తారు అన్నారు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు బ్రాహ్మణులకు ఏ స్థాయిలో అవమానాలు జరిగాయో ఈనాడు ఎల్లో మీడియాకు గుర్తు లేదా అంటూ ఆయన ప్రశ్నించాడు. తెలుగు దేశం పార్టీ ఇప్పుడు అనేక రకాలుగా బ్రాహ్మణులకు మేలు చేస్తాం, బ్రాహ్మణులు మేధావులకు మద్దతు అన్నట్లుగా మాట్లాడుతున్నారు. కానీ గతంలో తెలుగు దేశం పార్టీ ముఖ్య నాయకులు బ్రాహ్మణులను అవమాన పరిచినట్లు గా మాట్లాడారు అంటూ మల్లాది విష్ణు అసహనం వ్యక్తం చేశారు. అధికారంలోకి ఒకవేళ మళ్ళీ తెలుగు దేశం పార్టీ వస్తే బ్రాహ్మణులను మళ్లీ విస్మరిస్తుందని.. అందుకే వారిని నమ్మొద్దు అంటూ మల్లాది విష్ణు అభిప్రాయం వ్యక్తం చేశారు.