వైఎస్ జగన్ మంత్రి వర్గంలో కొత్త మంత్రిగా ఈయన ఎంట్రీ ఇవ్వబోతున్నాడా?
malladi vishnu : ఏపీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు అయ్యి రెండు సంవత్సరాలు కాబోతుంది. ఇప్పటి వరకు మంత్రి వర్గ విస్తరణ జరిగిందే లేదు. కరోనా కారణంగా మంత్రి వర్గ విస్తరణ వాయిదా పడుతూ వస్తుంది. ఎట్టకేలకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన మంత్రి వర్గంలో మార్పులు చేర్పులు చేయాలని నిర్ణయించుకున్నాడు. ప్రస్తుతం మంత్రి వర్గంలో ఉన్న ముగ్గురు లేదా నలుగురికి ఉద్వాసన తప్పదని అంటున్నారు. యువకులకు మరియు ఎమ్మెల్యేలుగా మంచి పేరు తెచ్చుకున్న వారికి తన మంత్రి వర్గంలో కొత్తగా చోటు ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భావిస్తున్నాడు. ఈ నేపథ్యంలో సీనియర్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కు మంత్రి పదవి దక్కడం ఖాయంగా వార్తలు వస్తున్నాయి.
malladi vishnu : ఎమ్మెల్యేగా మంచి మార్కులు…
ఎమ్మెల్యేగా నియోజక వర్గంలో malladi vishnu మల్లాది విష్ణుకు మంచి పేరు ఉంది. ప్రతి రోజు ప్రజల సమస్యలను తెలుసుకుని వారికి చేరువగా ఉండేలా కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. తన నియోజక వర్గంలో ఉన్న అన్ని వర్గాల వారికి సమాన న్యాయం అందిస్తూ మంచి పేరును తెచ్చుకున్నాడు. రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వం నుండి వస్తున్న నిధులను సద్వినియోగం చేసి నియోజక వర్గంలో అభివృద్ది చేయడం జరిగింది. కనుక ఆయనకు నియోజక వర్గాల సర్వేలో మంచి మార్కులు పడ్డట్లుగా తెలుస్తోంది. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొత్త మంత్రి వర్గంలో మల్లాదికి చోటు ఖాయం అంటున్నారు.
malladi vishnu : వెల్లంపల్లికి చెక్..
మంత్రి వెల్లంపల్లి విషయంలో గత కొన్ని రోజులుగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసంతృప్తితో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. కనుక ఆయన్ను తప్పించే అవకాశాలు ఉన్నాయంటున్నారు. త్వరలోనే వెల్లంపల్లి కి ఉద్వాసన తప్పదనే వారు ఉన్నారు. ఆయన స్థానంలో మల్లాది విష్ణుకు స్థానం దక్కించే అవకాశం ఉందని అంటున్నారు. విజయవాడలో తెలుగు దేశం పార్టీ బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్న సమయంలో వైకాపా నుండి బలమైన నాయకుడు అక్కడ ఉండాలని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భావిస్తున్నారు. అందుకే మల్లాదికి ఛాన్స్ పక్కా అంటున్నారు.