Manchu Manoj : మంచు మనోజ్‌.. భూమ మౌనిక లవ్‌ స్టోరీ ఎలా, ఎక్కడ మొదలయ్యింది? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Manchu Manoj : మంచు మనోజ్‌.. భూమ మౌనిక లవ్‌ స్టోరీ ఎలా, ఎక్కడ మొదలయ్యింది?

 Authored By aruna | The Telugu News | Updated on :6 September 2022,12:00 pm

Manchu Manoj : నిన్న నేడు టాలీవుడ్ లో మంచు మనోజ్ మరియు భూమా మౌనిక రెడ్డి ల పెళ్లి గురించే ఎక్కువ మంది మాట్లాడుకోవడం కనిపిస్తుంది. ఎక్కడ చూసినా అదే చర్చ నడుస్తోంది. అసలు వారిద్దరికీ ఎక్కడ పరిచయమైంది.. వారిద్దరికీ మధ్య ప్రేమ ఎలా మొదలైంది అనేదే ఆ చర్చ సారాంశం. ఇక్కడ కొద్ది మందికి తెలియని విషయం ఒకటి ఉంది. మంచు మనోజ్ గతంలోనే ప్రణతి ని పెళ్లి చేసుకొని విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. కానీ మౌనిక రెడ్డి కూడా 2015 సంవత్సరంలో బెంగళూరుకు చెందిన వ్యాపార వేత్త తో వివాహం జరిగింది.. ఒక బాబు కూడా ఉన్నాడు అనే విషయం అతి కొద్ది మంది మాత్రమే తెలుసు.

కొన్ని కారణాలవల్ల అతడితో విడి పోయిన మౌనిక రెడ్డి ప్రస్తుతం హైదరాబాదులో తన కొడుకుతో ఒంటరిగా జీవితం గడుపుతోంది ఈ సమయంలో మంచు మనోజ్ కూడా తన ఒంటరి జీవితం గడుపుతున్నాడు. ఇద్దరికీ ఎక్కడ ఏ సందర్భంలో పరిచయమైందో కానీ ఇద్దరు ఒకరి మనసులు కలిశాయి. ఒకరిని గురించి ఒకరికి తెలియడంతో ఒకరి కష్టాలు ఒకరు చెప్పుకొని ఒక్కటి అయ్యే మార్గమును వెతుక్కున్నారు. వారిద్దరి ప్రేమకి వారిద్దరి యొక్క నిర్ణయానికి ఇరు కుటుంబాలు ఓకే చెప్పాయి. మంచు ఫ్యామిలీ మరియు భూమా ఫ్యామిలీ మధ్య జరిగిన చర్చలు వారిద్దరి పెళ్ళికి ఓకే చెప్పడంతో అతి త్వరలోనే వారి పెళ్లి జరగబోతుంది.

manchu manoj and bhuma mounika reddy love story

manchu manoj and bhuma mounika reddy love story

మొత్తానికి మంచు మరియు భూమా కుటుంబాల మధ్య వివాహ బంధం ఏర్పడుతుందని తో అంతా కూడా ఆసక్తిగా ఈ విషయమై చర్చించుకుంటున్నారు. కొన్నాళ్ల క్రితం మంచు మనోజ్ ట్విట్టర్లో స్పందిస్తూ మళ్ళీ పెళ్లి చేసుకునే ఆలోచన అస్సలే లేదు అంటూ తేల్చి చెప్పాడు. కానీ ఒక కార్యక్రమంలో భూమా మౌనిక రెడ్డిని చూశాడో అప్పుడే ఆమెపై ప్రేమ కలిగినట్లుగా ఉంది. అందుకే తన నిర్ణయాన్ని కూడా మార్చేసుకుని ఆమెతో పెళ్లికి సిద్ధమయ్యాడు. ఈ కొత్త జంట కొత్త జీవితం సంతోషంగా సాగాలంటూ వారి అభిమానులు కోరుకుంటున్నారు. వారితో పాటు మనము కూడా వీరి సంసార జీవితం సాఫీగా సాగాలని ఆశిద్దాం.

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది